ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల హక్కుల కోసం చలో కమిషనరేట్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో ఈ నెల 28న ఎన్ హెచ్ ఎం -జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్ హెచ్ ఎం-జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం ఎదుట చలో కమిషనరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. భాస్కర్ నాయక్ ను కలిసి అనుమతి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఎన్ హెచ్ ఎం ఉద్యోగి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఎన్ హెచ్ ఎం -జెఏసి నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన ఎన్ హెచ్ ఎం సిబ్బంది హైదరాబాద్ చలో కమిషనరేట్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

Latest Articles

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప...

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

Related Articles

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను...

బంజారా సేవా సంఘం మదనాపూర్ మండల అధ్యక్షుడిగా రవినాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: మదనాపూర్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా మూడవత్ రవినాయక్...

చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం 

– కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట...
error: Content is protected !!