– రూ.1,75,516.లకు లడ్డూ వేలం పాటలో గ్యాస్ జడలయ్య దక్కించుకున్నారు.
పొలిటికల్.పవర్.సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్. 28. 2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గణపతి నవరాత్రులలోభాగంగామంగయ్యగుడిదేవాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతోపూజలునిర్వహించారు.నవరాత్రిఉత్సవాలు ముగియడంతో ఆదివారం సాయంత్రం వినాయక విగ్రహాన్నినిమజ్జనానికిశోభాయాత్రగాతరలించారు.ఈసారి నిర్వహించిన శోభాయాత్ర గతంలో కంటే భిన్నంగా,వినూత్నరీతిలోసాగింది.ముంబై,హైదరాబాద్.వంటిమహానగరాల్లోనిర్వహించేవిధానాన్నిస్ఫూర్తిగాతీసుకునికాలనీలోనిఓప్రాంతంలోప్రత్యేకంగాట్రస్,ఏర్పాటుచేసి,వివిధరకాలవిద్యుత్,దీపాలంకరణలతో ప్రాంగణాన్నిసుందరంగాతీర్చిదిద్దారు.అదేప్రాంగణంలో ఎలాంటి శబ్ద, వాయు కాలుష్యానికితావులేకుండా సంప్రదాయబద్ధంగావేడుకలునిర్వహించారు.మహిళలు బతుకమ్మలు ఆడుతూ, యువత సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తూ వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తి, సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకుప్రాధాన్యతనిస్తూనిర్వహించినఈవినూత్న కార్యక్రమంస్థానికులనువిశేషంగాఆకట్టుకుంది.మంగయ్య గుడి వద్దప్రతిఏడాదిప్రతిష్ఠించేగణపతివిగ్రహానికి భీమ ప్రసన్న లక్ష్మీ బంగారయ్య దంపతులు విగ్రహ దాతగా వ్యవహరిస్తుండటం విశేషం.మంగయ్య గుడి గణపతి లడ్డూ వేలంలో రూ.1,75,516 ధరపలికింది. ఈ లడ్డూనుకాలనీకిచెందినగ్యాస్.జడలయ్యవేలంలో దక్కించుకున్నారు. లడ్డూ వేలం కార్యక్రమంలో భక్తులు,కాలనీవాసులుఉత్సాహంగాపాల్గొన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు భీమ కిషోర్ కుమార్, నరుకుల శ్రీనివాసులు, బాలకృష్ణ చారి, నిశాంత్ గౌడ్, జంగం సాయి,రాకేష్ , శివదత్త , సాయి , మహిళలు , భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


