ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

సెగ మొదలైందా..? అధికారులు జాగ్రత్త పడుతున్నారా? చిత్తూరు ఏకగ్రీవాలపై కలెక్టర్ సీరియస్.  24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆర్వోలకు నోటీసులు జారీm  ఉపసంహరణల వెనుక కారణాలపై ప్రశ్నల వర్షం. బీ-ఫారాల చింపివేత, సిబ్బందిపై దాడి ఘటనలపై కమిషనర్‌కు ఆదేశాలు.

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

చిత్తూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల్లో ఏకంగా 51 డివిజన్లు ఏకగ్రీవం కావడంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏకగ్రీవాల వ్యవహారంపై 24 గంటల్లోగా రాతపూర్వక నివేదిక సమర్పించాలని రిటర్నింగ్ అధికారులందరికీ (ఆర్వోలకు) ఆయన గురువారం నోటీసులు జారీ చేశారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలను దొంగ సంతకాలతో ఉపసంహరించుకునేలా చేయడం వల్లే 51 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటానికి సైతం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు.

ఆర్వోలకు కలెక్టర్ సంధించిన ప్రశ్నలు..

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు?

నేరుగా ఎవరు వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు?

ఉపసంహరణకు వారు తెలిపిన కారణాలు ఏమిటి?

అభ్యర్థులు, ప్రతిపాదకుల ధ్రువీకరణను అధికారులు స్వయంగా పరిశీలించారా?

ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆర్వోలను కలెక్టర్ ఆదేశించారు. వీటితో పాటు కార్పొరేషన్ కార్యాలయంలో చోటుచేసుకున్న బీ-ఫారాల చింపివేత, ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన దాడి, కెమెరాల ధ్వంసం ఘటనలపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ తాజా ఆదేశాలతో రిటర్నింగ్ అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నివేదికలో పూర్తి వాస్తవాలు వెల్లడించాలా, లేదా అన్న సందిగ్ధంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ 51 డివిజన్ల ఏకగ్రీవాల వ్యవహారం చివరకు ఏ అధికారి మెడకు చుట్టుకుంటుందో, ఎవరి ఉద్యోగానికి ముప్పు తెస్తుందోనని స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.

27 వ తేదీన సుప్రీం కోర్టు లో ఎంత మంది అధికారులు బలి కాబోతున్నారో??

Latest Articles

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు...

బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో...

Related Articles

బల్మూరి వెంకట్ కబ్జా బాగోతంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పొలానికి ఉన్న ఉమ్మడి దారిని ఆక్రమించి, ఇదేంటని...

YS Jagan calls for unity in Kadapa Polls

 Yerra Nagaraju Reddy Telangana and Andhra Pradesh States Bureau In-charge for "Political Power Comprehensive National Telugu Daily Newspaper" & "Political News9 TV...

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...
error: Content is protected !!