ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు!

విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి పునరాగమనం

పట్టణ సమస్యలపై వైస్ చైర్మన్ ప్రత్యేక దృష్టి

అభివృద్ధి పనులపై ప్రజల్లో పెరిగిన ఆశలు

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్ట్ (వడితే గణేష్ అక్టోబర్ 30)

: అశ్వారావుపేట మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి జూపల్లి రమేష్ బాబు పేరు చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మళ్లీ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పట్టణంలో బాస్ ఈజ్ బ్యాక్.. మళ్లీ జూపల్లి జోరు మొదలు! అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

అభివృద్ధి పనులే ప్రధాన లక్ష్యం!

పదవి అనేది అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత అనే దిశగా జూపల్లి రమేష్ బాబు అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు పట్టణ ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే 14, 15వ వార్డుల్లో సీసీ రహదారులు, మురుగు కాలువల పనుల పరిశీలనతో పట్టణ అభివృద్ధిపై తన చొరవను చాటుకున్నారు. మిగిలిన వార్డుల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం!

పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు, విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయానికి స్థల పరిశీలన వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటితో పాటు తాగునీటి సమస్యలు, రహదారుల నిర్మాణం, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి ప్రజలకు నిత్యం ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. ప్రజల ఆశలు.. జూపల్లి బాధ్యతలు!  విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జూపల్లి రమేష్ బాబు రాకతో మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వార్డుల్లో పర్యటనలు, అధికారులతో సమీక్షలు, పెండింగ్ పనులపై పర్యవేక్షణ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ద్వారా పట్టణ అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. బాస్ మళ్లీ వచ్చారు.. ఇక అభివృద్ధి పనుల్లో ఎంత వేగం చూపిస్తారు? ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి చొరవ తీసుకుంటారు? అన్నది పట్టణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Latest Articles

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

అన్నపురెడ్డిపల్లిలో ప్రగతి పరుగులు.. దుమ్ము బాధలకు చరమగీతం!

  ● రూ. 5.80 కోట్లతో మండల కేంద్ర ప్రధాన రహదారికి మహర్దశ ●శరవేగంగా...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు....అక్టోబర్ 31 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్నాడు లక్షెట్టిపేట్ గర్ల్స్ ఉన్నత...

error: Content is protected !!