ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

📰 Generate e-Paper Clip

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 31. 2026. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు జర్నలిస్టులు సిద్ధం కావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే,ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్ పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటాలే మార్గమని స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే,ఐజేయూ జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మధుగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జర్నలిస్టు సంఘంగా ఉన్న టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంఘం ముందుండి పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉందని మధుగౌడ్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలపై నిరంతరం వార్తలు రాస్తూ సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టులకు సొంత ఇంటి స్థలం లేకపోవడం ఆవేదనకరమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల సమస్యపై సానుకూలంగా స్పందించాలని కోరారు. స్థలాల సాధన కోసం జర్నలిస్టులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు మంజూరు విషయంలో కూడా యూనియన్ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యధికంగా వనపర్తి జిల్లాలో409 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇప్పించడంలో జిల్లా కమిటీ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఇంకా అక్రిడేషన్ కార్డులు పొందని అర్హులైన జర్నలిస్టులకు కార్డులు ఇప్పించేందుకు యూనియన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.
మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్బులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేవల్లి మండల కేంద్రంలో సింగిల్ విండో కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షట్టర్‌లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు యూనియన్ తరఫున కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన సమస్యలు ఎదురైనప్పుడు సంఘం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
జర్నలిస్టులు నిజాయితీతో, ఐకమత్యంతో పనిచేసినప్పుడే తమ హక్కులను సాధించుకోగలరని మధుగౌడ్ అన్నారు. వార్తా సేకరణలో పక్షపాతానికి తావులేకుండా అన్ని రాజకీయ పార్టీలను సమాన దృష్టితో చూడాలని సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే జర్నలిస్టుల ప్రధాన బాధ్యతగా ఉండాలన్నారు. జిల్లా అధ్యక్షుడు మాధవరావు మాట్లాడుతూ జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఐక్యంగా ఉండాలని, యూనియన్ జర్నలిస్టుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడబోదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల బలంతోనే జిల్లాలో అత్యధికంగా అక్రిడేషన్ కార్డులు సాధించుకోగలిగామని అన్నారు.
ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నించినప్పుడే వాటి పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందన్నారు. జర్నలిస్టులు తమ వృత్తి విలువలను కాపాడుకుంటూ హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎన్ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రాజు, కోశాధికారి మన్యం,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అంజి.. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్రంచారీ, శ్రీనివాస్ రావు, వనపర్తి పట్టణ యూనియన్ అధ్యక్షుడు తైలం అరుణ్,పెబ్భైర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలవర్ధన్,
శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలరాజు,రేవల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హరీష్, కార్యదర్శి నవీన్, గణేష్, రామకృష్ణ, దామోదర్, రవీందర్ శేఖర్, శ్రీనివాసులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

Latest Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

Related Articles

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ జయప్రకాష్ కాలనీలో బేడ బుడగ జంగాల గుడిసెలో విద్యుత్ ఆపివేతపై...

జిల్లాస్థాయిభజనపొటీలలోముమ్మళ్ళపల్లి గ్రామం శ్రీ గురు హరి భజన మండలి సభ్యులకు ప్రశాంశ పత్రలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026. వనపర్తి పట్టణంలో జరుగుతున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచా...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026:...
error: Content is protected !!