ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

📰 Generate e-Paper Clip

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే!

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి – ఆర్టీఐ యాక్టివిటీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ అక్టోబర్ 30 2026: మహబూబ్‌నగర్ జిల్లా: అడ్డాకుల మండలం వర్ని గ్రామంలో మహిళా సంఘాల నిధుల దుర్వినియోగం వ్యవహారంపై చేపట్టిన ఆర్టీఐ పోరాటం ఫలితాన్నిచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు, జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఫలితంగా రూ.1,29,000లు రికవరీ చేసి మహిళా సంఘం ఖాతాలో జమ చేసినట్లు ఆర్టీఐ యాక్టివిటీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్ వెల్లడించారు. మహిళా సంఘాల నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వర్ని గ్రామానికి చెందిన యువకులు మంద నవీన్ కుమార్ తదితరులు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం రూ.1.29 లక్షలను మహిళా సంఘం ఖాతాలో జమ చేయించినట్లు తెలిపారు. అయితే ఇంకా సుమారు రూ.3 లక్షల నిధులు రికవరీ కావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని కూడా తక్షణమే మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ సంఘ సహాయకురాలిపై (వీఓఏ) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ యాదగిరి బదిలీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సొమ్ముకు పూర్తి రక్షణ కల్పించి, మిగిలిన నిధులను కూడా రికవరీ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మంగరాయి వెంకటేష్ స్పష్టం చేశారు.

Latest Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు....అక్టోబర్ 31 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్నాడు లక్షెట్టిపేట్ గర్ల్స్ ఉన్నత...

error: Content is protected !!