పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 02 2026: పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని మరో 10 రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కోరారు. చాలా మంది పట్టభద్రులు అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు ఓటర్లుగా నమోదు చేసుకోలేకపోయారు. ఉద్యోగాలు, ఉన్నత చదువులు, ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల చాలా మంది గడువులోపు దరఖాస్తు చేయలేకపోయారు. పట్టభద్రుల ఓటు హక్కు అత్యంత విలువైనది, ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు అవకాశం కల్పించాలని శంకర్ గౌడ్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఇంకా అవగాహన లేకపోవడం వల్ల నమోదు ఆలస్యం అయింది. ఆన్ లైన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు కూడా కొందరికి ఇబ్బందిగా మారాయి. కావున మానవతా దృక్పథంతో మరో 10 రోజులు గడువు పొడిగిస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ గౌడ్ కోరారు. ఇంకా వేల మంది పట్టభద్రులు నమోదుకు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి గడువు పొడిగింపుపై ప్రకటన చేయాలని పలుస శంకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల గొంతుకగా నా ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఓటు నమోదు పొడిగిస్తే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది అని అన్నారు.

