ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

ఇల్లందు నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల వరుస వైఫల్యాలకు ఇది నిదర్శనం.

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్లమండలం ప్రతినిది :

​సీతారామలో సున్నా..
మున్నేరు -పాలేరు లింక్ కెనాల్‌లో అన్యాయం..
కరువు లిస్టులో శూన్యం..
​బయ్యారం, గార్ల మండలాల్లో 70% భూములు బీడుగా ఉన్నా పట్టదా? మన ఇల్లందు ప్రాంతమంటే ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధికి అంత అలసత్వమా?
​మన ఇల్లందు నియోజకవర్గం, ముఖ్యంగా గార్ల, బయ్యారం ప్రాంతాలు నూటికి నూరు శాతం (100%) వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న ఏజెన్సీ ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతానికి నీటి ప్రాజెక్టులలోనూ, కరువు సహాయంలోనూ పదే పదే తీవ్ర అన్యాయం జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిదులు నోరు మెదపకపోవడం, అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉండటం అత్యంత విచారకరం.
​1. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ – ఇల్లందు నియోజవర్గంకు ఒక్క బొట్టు నీరు లేదు:
​ఆనాడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలానికి మండలానికి కూడా నీళ్లు అందించాల్సి ఉన్న దాన్ని డిజైన్ మార్చి సత్తుపల్లి కి పాలేరుకి మన ప్రాంతం నుండి నీళ్లు తీసుకుపోతున్న స్థానిక ప్రజాప్రతినిదులు ఏమాత్రం స్పందించకుండా మౌనంగా కూర్చున్నారు..
​2. మున్నేరు -పాలేరు లింక్ కెనాల్ – గార్ల మండలానికి తీవ్ర అన్యాయం:
​నేడు మున్నేరు -పాలేరు లింక్ కెనాల్ విషయంలోనూ గార్ల మండలానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే నిరసించాల్సింది పోయి, తరలిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు.
చెరువుల్లో నీళ్లున్నా గార్ల, బయ్యారం రైతుల పొలాలకు నీరందేలా ప్రణాళిక చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు.
​డోర్నకల్, ములుగు, మహబూబాబాద్ నియోజకవర్గంలో లో కరువు మండలాలు ప్రభుత్వం ప్రకటించింది..
కానీ ఇల్లందులో మాత్రం శూన్యం:
​నేడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటిస్తోంది. పక్కనే ఉన్న డోర్నకల్, ములుగు, మహబూబాబాద్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మూడేసి, నాలుగేసి మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించుకున్నారు. కానీ, ఎల్-నినో ప్రభావంతో గార్ల, బయ్యారం మండలాల్లో 70% కంటే ఎక్కువ భూములు సాగుకు నోచుకోక బీడుగా పడి ఉన్నా…
మన గార్ల మండలాన్ని కరువు జాబితాలో చేర్పించడంలో స్థానిక ప్రజాప్రతినిదులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
​అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు వైఫల్యం:
​బయ్యారం, గార్ల పెద్ద చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నా ఇరిగేషన్ అధికారుల అలసత్వం వల్ల ఆ నీటిని ఆరుతడి పంటలకు కూడా అందించకపోవడం దుర్మార్గం కాదా?
​పక్క నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు ఉన్న పట్టింపు, బాధ్యత ఇల్లందు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ఎందుకు లేదు?
​సాగునీటి ప్రాజెక్టుల్లోనూ, కరువు సహాయంలోనూ ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంటే పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటి?
​మా ప్రధాన డిమాండ్లు:
​గార్ల, బయ్యారం మండలాలను వెంటనే ‘కరువు మండలాలు’గా ప్రకటించాలి.
కరువు జాబితా జీవోను తక్షణమే సవరించి ఇల్లందు నియోజకవర్గ మండలాలను చేర్చాలి.
​ఆరుతడి పంటలకు తక్షణమే నీటి విడుదలచేయాలి.
బయ్యారం, గార్ల పెద్ద చెరువుల నుండి ఆరుతడి పంటలకు ఇరిగేషన్ అధికారులు వెంటనే నీటిని విడుదల చేయాలి.
​రైతులకు ఎకరానికి రూ. 25,000 పరిహారం: సాగు చేయలేక, నీళ్లు అందక నష్టపోయిన ప్రతి రైతుకూ తగిన నష్టపరిహారం చెల్లించాలి.
​సీతారామ ప్రాజెక్టు నీటి హక్కులను సాధించాలి.
ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఆయకట్టుకు రావాల్సిన నీటి వాటాను సాధించేలా ఉన్నతాధికారులతో మాట్లాడాలి.
​గతంలో ప్రాజెక్టు నీళ్ల విషయంలో చేసిన తప్పులనే, నేడు కరువు మండలాల ప్రకటనలోనూ పునరావృతం చేశారు.
మీ
శీలంశెట్టి రమేష్
Ex mptc, BRS పార్టీ.

Latest Articles

అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే జారె

156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేతపొలిటికల్ పవర్,...

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఎన్నికల హామీలు అమలు...

Related Articles

డ్రైనేజీ బీభత్సం: మురుగుకూపంలో ‘కాకతీయ నగర్’!  * వారం రోజులుగా రోడ్లపై పారుతున్న మురుగునీరు!  * శోభా డైరీ ఫామ్ పశువుల పేడ కలవడంతో మరింత దుర్గంధం!  *...

మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్ - ఉపేందర్ కూరెళ్ళ):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి 9వ డివిజన్ ‘కాకతీయ నగర్’ కాలనీవాసుల పరిస్థితి తీవ్ర వర్ణనాతీతంగా మారింది. గత వారం...

ఉచిత గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకేంద్రాన్నిప్రారంభించినమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణా గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిది:ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదు ప్రక్రియలో భాగంగా ఇల్లందు శాసనసభ్యులు శ్రీ...

భద్రాద్రి కొత్తగూడెం రెవెన్యూ శాఖలో సమయపాలన కరువు! ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు తహసీల్దార్లు? ప్రజలకు అందని ప్రభుత్వ సేవలు.. కింది స్థాయి అధికారుల తీరుతో కలెక్టర్ కార్యాలయ ప్రతిష్ఠకు భంగం...

భద్రాద్రి కొత్తగూడెం: పొలిటికల్ పవర్ ప్రతినిధిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి కొందరు అధికారుల పనితీరు, సమయపాలన, విధి నిర్వహణపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం...
error: Content is protected !!