
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన భాషావిభాగం వారు ప్రచురించిన ప్రత్యేక గ్రంథములో శ్రీశైలమహాక్షేత్రం విశేషాలు తెలిపే ప్రత్యేక వ్యాసం ప్రచురితమైందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు.
కేంద్ర హోంమంత్రత్వశాఖలోని భాషావిభాగం వారు “శివ: అనాదిహై అనంత్‌హై” అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగిందన్నారు. ఈ గ్రంథములో శివతత్త్వంపై బహుముఖ కోణాలలో పలు ప్రత్యేక రచనలు ప్రచురించబడ్డాయన్నారు. ఈ గ్రంథంలో శ్రీశైలక్షేత్ర విశేషాలు తెలియజెబుతూ తాను రచించిన ప్రత్యేక వ్యాసం ప్రచురించబడిందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పేర్కొన్నారు.
ఈ గ్రంథాన్ని గౌరవనీయ కేంద్ర హోంశాఖామంత్రివర్యులు శ్రీ అమిత్‌షా సెప్టెంబరు 14వ తేదీన నవీముంబైలో జరిగిన అఖిలభారత 6వ భాష సదస్సు ( 6th All India Official Language conference) నందు ఆవిష్కరించడం జరిగిందన్నారు.
ఈ ప్రత్యేక వ్యాసంలో శ్రీశైల సంబంధి పలు విశేషాలను తాను వివరించడం జరిగిందన్నారు. మరెక్కడాలేని విధంగా శ్రీశైలమహాక్షేత్రంలో జ్యోతిర్లింగం, మహాశక్తిస్వరూపం ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువై వుండడం, ఇలకైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైలానికి అనాదిక్షేత్రమనే ప్రసిద్ధి ఉండడం, వైదిక కార్యక్రమాలలో శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని సంకల్పాలను చెప్పుకోవడం, శ్రీస్వామిఅమ్మవార్ల ఆవిర్భావం, శ్రీశైలభౌగోళిక స్వరూపం, శ్రీశైలఅడవుల్లోని అరుదైన వృక్ష సంపద, శ్రీశైలక్షేత్ర చరిత్ర, సంస్కృతి – సంప్రదాయాలకు చెందిన అంశాలు, క్షేత్ర దర్శనీయ స్థలాలు మొదలైన అంశాలను తాను ఈ వ్యాసములో క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు.
హిందీలో ప్రచురితమైన ఈ గ్రంథం వలన శ్రీశైలమహాక్షేత్రానికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మరింత ప్రచారం లభించే అవకాశం ఉందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు అన్నారు.

