ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

మనిగిల్ల చెరువుల అలుగుల పటిష్టతకు చర్యలు

📰 Generate e-Paper Clip

పనులు త్వరలో ప్రారంభం.. చెరువుల కట్టలను పరిశీలించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని వెంకన్న చెరువు, చౌట చెరువుల అలుగుల పటిష్టతకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అచ్చన్న కాలువ అలుగు మరమ్మతులు, రెండు చెరువుల కట్టలపై జంగిల్ కటింగ్, చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలకు స్థానికంగా పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చే సోమవారం నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్ కుమార్, వి.బి. గ్రామ జి.సి. ఈసీ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రామ్ రెడ్డి, వెంకటరెడ్డితో కలిసి రెండు చెరువుల కట్టలను పరిశీలించారు. చెరువుల అలుగుల పటిష్టత, మరమ్మతులు, పూడికతీత పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, ప్రేమ్ కుమార్ రెడ్డి, బోడి గణేష్, తిరుపతయ్య, బాలకృష్ణ, బలరాం యాదవ్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

కొబ్బరి బొండాల మాటున 08 పశువుల అక్రమ రవాణా..మరిపెడ పోలీసుల రాత్రి గస్తీతొ వెలుగులోకి అక్రమ దందా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

కలసపాడు మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎన్నికకు సర్వం సిద్ధం.

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ...

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక పీస్ 9 టీవీ తెలుగు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫారం–18 అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫారం–18 అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏఐపీసీ, ఎన్‌ఎస్‌యూఐ...

అల్వాల సభ.. నిరంజన్‌రెడ్డికి ఓదార్పు సభే!

వనపర్తిలో మీ గెలుపు కల.. 2028లోనూ ఓటమి తప్పదు! ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్! హరీష్‌రావుకు మతిభ్రమించిందా? సిద్దిపేటలో పంటలు ఎండలేదా? మంగంపల్లిలో దళితుడి ఇంట్లో నిరంజన్‌రెడ్డి మంచినీళ్లు ఎందుకు తాగలేదు? మాజీ మంత్రులపై విరుచుకుపడ్డ...

భూమి కొనుగోలు వ్యవహారంలో కొత్త మలుపు!

రాజకీయ దురుద్దేశంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బురదజల్లడం తగదు గ్రామ పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధం.. రాళ్ల కృష్ణయ్య పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!