ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

ఎన్నికల హామీలు అమలు చేయాలి.. రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌


పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 3: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ మండల కన్వీనర్‌ మురహరి రఘు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దమ్మపేట, పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఆశా వర్కర్లు సమ్మె నోటీసులు అందజేశారు.

ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,900 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. కనీసం రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత మూడేళ్లుగా తమ సమస్యలను అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.

పట్వారిగూడెంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల నాయకత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కోరారు. పలు ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

దమ్మపేటలో వైద్యాధికారికి సమ్మె నోటీసు అందజేసిన కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యురాలు సునీతతో పాటు రాధ, నాగమణి, వరలక్ష్మి, ప్రమీల, కుమారి తదితరులు పాల్గొన్నారు. పట్వారిగూడెంలో వైద్యాధికారి డాక్టర్‌ వెంకట ప్రవీణ్‌కు నోటీసు అందజేయగా, శ్రీలత, నాగమణి, భాగ్యమ్మ, కృష్ణవేణి, అంజలి, జైనవి, సరోజిని తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Latest Articles

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక పీస్ 9 టీవీ తెలుగు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫారం–18 అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అల్వాల సభ.. నిరంజన్‌రెడ్డికి ఓదార్పు సభే!

వనపర్తిలో మీ గెలుపు కల.. 2028లోనూ ఓటమి తప్పదు! ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవాకులు...

భూమి కొనుగోలు వ్యవహారంలో కొత్త మలుపు!

రాజకీయ దురుద్దేశంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బురదజల్లడం తగదు గ్రామ పెద్దల సమక్షంలో...

మనిగిల్ల చెరువుల అలుగుల పటిష్టతకు చర్యలు

పనులు త్వరలో ప్రారంభం.. చెరువుల కట్టలను పరిశీలించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్...

అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే జారె

156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేతపొలిటికల్ పవర్,...

Related Articles

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక పీస్ 9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్,లోకకల్యాణం కోసం దేవస్థానం నేడు (03.11.2026) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను...

అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే జారె

156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేతపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్,ఎం. నాగార్జున, అశ్వారావుపేట, నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధిత కుటుంబాలకు...

యాబై ఏండ్లు దాటిన గొర్రెలు, మేకల పెంపకం దార్లకు 5 వేల రూ,ల పెన్షన్ ఇవ్వాలిగొర్రెల కాపరుల కష్టాలపై క్షేత్రస్థాయి సర్వేలో -రాష్ట్ర నాయకులు గోవింద్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిది :గార్లమండలంలో 50 సం,లు దాటిన గొర్రెలు, మేకల కాపరులకు ప్రతి నెల 5 వేల...
error: Content is protected !!