ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

📰 Generate e-Paper Clip

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి లేదు

పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 4: ఒకవైపు కుండపోత వర్షాలు.. మరోవైపు ఉండటానికి సరైన ఇల్లు లేదు. కనీస వసతులు కూడా కరువై ఓ నిరుపేద ఒంటరి మహిళ జీవితం దుర్భరంగా మారింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీ పరిధిలోని తాటిమల్లపుగుంపులో నివసిస్తున్న బుచ్చమ్మకు తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కష్టాలను మరింత పెంచాయి. ఆమె నివసిస్తున్న పూరిల్లు పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 

ఒంటరిగా జీవనం సాగిస్తున్న బుచ్చమ్మకు కనీసం రాత్రివేళ తలదాచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇంటి చుట్టూ నీరు చేరడంతో పాటు ఇంట్లోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. విద్యుత్‌ సౌకర్యం లేక చీకట్లోనే కాలం వెళ్లదీస్తోంది. వంట చేసుకునేందుకు వీలులేక, తినడానికి తిండి.. ఉండటానికి గూడు లేక అవస్థలు పడుతోంది. రాత్రిపూట నిద్రించేందుకు కూడా ఖాళీ ప్రదేశం లేక తెల్లవార్లూ మేల్కొని ఉండాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. రోడ్డుపక్కన దీనంగా కూర్చున్న ఆమె పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది.

ఇల్లు కోసం వేడుకున్నా ఫలితం లేదంటున్న బుచ్చమ్మ

తనకు ఇల్లు మంజూరు చేయాలని గతంలో పలుమార్లు పంచాయతీ సిబ్బందిని సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని బుచ్చమ్మ వాపోతోంది. సొంత ఇంటి స్థలం కూడా లేకపోవడంతో ఉన్న పూరిల్లు వర్షాలకు నీటమునిగిన వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి

బుచ్చమ్మ దీనస్థితిని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేకంగా పరిశీలించి తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముందుగా ఆమెకు సురక్షితమైన తాత్కాలిక వసతి కల్పించి, అర్హతను పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. ప్రకృతి వైపరీత్యంతో నిలువ నీడ కోల్పోయిన బుచ్చమ్మకు ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తారా? ఆమెకు సురక్షితమైన నివాసం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Latest Articles

భూమిని కాపాడితేనే భవిష్యత్తు పంటకు భరోసా…..

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు నామమాత్రంగా పిల్లలకు భోజనం పెడుతున్నారని ఆరోపణలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం

మేడిపల్లి: 04 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి పోలీస్...

గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం…

రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్... పొలిటికల్...

రాందేవ్ జువెల్లరీలో చోరీ: ‘పవర్’ఫుల్ స్కెచ్ వేసిన ఖాకీలు… దొంగ అరెస్ట్, 4 తులాల బంగారం రికవరీ!

మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్ - ఉపేందర్ కూరెళ్ళ):అత్యాశకు అప్పులు తోడయ్యాయి......

Related Articles

error: Content is protected !!