ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

📰 Generate e-Paper Clip

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ

పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన మందలపల్లి సర్పంచ్‌ గుజ్జుల శ్రీనివాసరావు, ఉపసర్పంచ్‌ మురళి సహాయక చర్యల్లో పాల్గొన్నారు

వరద నీటితో ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. రాకపోకలకు ఆటంకం కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టడంలో చొరవ చూపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు:...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.....

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పెద్దవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్‌కు గండి

వరద ఉధృతికి దెబ్బతిన్న రింగ్‌బండ్‌.. పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళనపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

Related Articles

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డిపొలిటికల్ పవర్, ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున,    అశ్వారావుపేట, అక్టోబర్ 4:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.. వరద బాధితులకు సహాయక చర్యలుదమ్మపేట, నవంబర్ 4: ప్రభుత్వ ఉద్యోగి అంటే కార్యాలయాలకే పరిమితమనే అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల కష్టాల్లో...

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 4: దమ్మపేట మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతాంగం...
error: Content is protected !!