ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

📰 Generate e-Paper Clip

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్!

తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.. వరద బాధితులకు సహాయక చర్యలు

దమ్మపేట, నవంబర్ 4: ప్రభుత్వ ఉద్యోగి అంటే కార్యాలయాలకే పరిమితమనే అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల కష్టాల్లో వారితో కలిసి నిలుస్తూ సేవలందిస్తున్న దమ్మపేట తహశీల్దార్ మద్దినేని మురళి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. మురసు తుపాను ప్రభావంతో మండలవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవించిన వేళ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలిచారు.

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజల పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడంలో చొరవ చూపారు. మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన నాగమణి మల్లెపూల వాగు వరద ప్రవాహంలో చిక్కుకోగా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఆమెను సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనలో గ్రామస్థుల సమాచారం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తహసిల్దార్ మద్దినేని మురళి ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వరద బాధితుల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అధికారులు అందుబాటులో ఉండాలనే బాధ్యతను తహశీల్దార్ మురళి తన పనితీరుతో చాటుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయ విధులకే పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానికులు తెలుపుతూ మద్దినేని మురళి (డిప్యూటీ కలెక్టర్‌ యూ/టీ, తహశీల్దార్‌) ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ తుపాను బాధితులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అధికారులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నారు.

ఆపద సమయంలో ప్రజల పక్కన నిలబడి భరోసా కల్పించే అధికారుల సేవలు సమాజానికి ఎంతో అవసరం. వరదల వంటి విపత్తుల వేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న అధికారుల కృషి అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు:...

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్...

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పెద్దవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్‌కు గండి

వరద ఉధృతికి దెబ్బతిన్న రింగ్‌బండ్‌.. పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళనపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

Related Articles

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డిపొలిటికల్ పవర్, ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున,    అశ్వారావుపేట, అక్టోబర్ 4:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట...

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటితో...

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 4: దమ్మపేట మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతాంగం...
error: Content is protected !!