ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

చైర్మన్, వైస్ చైర్మన్ ఆదేశాలతో రంగంలోకి జూపల్లి ప్రమోద్.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన!* ప్రజల ఇబ్బందులపై ఆరా.. రోడ్లు, డ్రైనేజీల శుభ్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన

📰 Generate e-Paper Clip

:పొలిటికల్ పవర్ ప్రతినిధి  అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి ప్రమోద్ ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి, తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గౌడ్ బజార్, మంగళ బజార్, సంత మార్కెట్ ఏరియా, వడ్డెర బజార్, దొంతికుంట, అంబేద్కర్ నగర్, చిన్నంశెట్టి బజార్, నిమ్మల బజార్, తూర్పు బజార్, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని, డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు.

భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జూపల్లి ప్రమోద్ వెంట హ్యాట్రిక్ కౌన్సిలర్ మిండా హరిబాబు, దండా బత్తుల రమేష్, అశ్వరావుపేట మున్సిపల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పసుపులేటి ఫణీంద్ర (నాని) తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

చెంచు గిరిజనుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం ఈవో, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్: గిరిజన మహిళల హర్షం!

నంద్యాల జిల్లా, శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు...

రైతుల కడుపు కొట్టిన మురసు

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ వి ఆర్...

*మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత తాగునీరు జాతీయ మానవ హక్కుల కమిషనర్ మిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య* 

**పొలిటికల్ పవర్ న్యూస్ నాంపల్లి మండలం*భగీరథతో నల్గొండ జిల్లా, నాంపల్లి...

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కొరతపై ఏఆర్వో ఆగ్రహం

 కరస్పాడు కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్ 9...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు...

Related Articles

రైతుల కడుపు కొట్టిన మురసు

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ వి ఆర్ 9టీవీ న్యూస్ (ఆర్సి కారం) వెంకటేష్ నవంబర్ 05మురసు తుఫాను వరదల వలన ములకలపల్లి మండలం నీట మునిగిన పంట...

*మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత తాగునీరు జాతీయ మానవ హక్కుల కమిషనర్ మిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య* 

**పొలిటికల్ పవర్ న్యూస్ నాంపల్లి మండలం*భగీరథతో నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్యకు పూర్తిగా చెక్.ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం అభినందనీయం.జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా....
error: Content is protected !!