ePaper
Friday, November 6, 2026
📄 ePaper

పట్టభద్రుల హక్కులే లక్ష్యం : టీఆర్‌ఎస్ (డి) పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణనల్లగొండ–వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్

కొత్తగూడెం, నవంబర్ 5 ( ) నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల గొంతుకగా నిలిచి, వారి హక్కుల సాధన కోసం పోరాడేందుకు డాక్టర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ (డెమోక్రటిక్) పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ వెల్లడించారు.

గతంలో రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్‌గా డాక్టర్ శంకర్‌రెడ్డి విశేష సేవలందించారని, కరోనా విపత్కర సమయంలో వేలాది మందికి అండగా నిలిచారని తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాట్లాడుతు రాజకీయ, సామాజిక రంగాల్లో అనుభవం కలిగిన ఆయనకు పట్టభద్రులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి, విద్య, ఆర్థిక భరోసా అంశాలను ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. పట్టభద్రుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడటంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి, గ్రాడ్యుయేట్ల ప్రతినిధులతో కమిటీలు నిర్మిస్తామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.

*హోదా కోసం కాదు.. హక్కుల సాధన కోసం!*

సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం తమ పార్టీ నినాదమని, ఎమ్మెల్సీ పదవి హోదా కోసం కాకుండా పట్టభద్రుల హక్కుల సాధన కోసమేనని నరాల సత్యనారాయణ స్పష్టం చేశారు. డాక్టర్ శంకర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్సీ ఇన్‌చార్జి కాంపెల్లి ప్రభు కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి సాధు శంకర్, భద్రాచలం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి సింగతి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8...

Related Articles

కామ్రేడ్ నీలంరామచంద్రయ్య, కా.జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ల త్యాగం చిరస్మరణీయం.. అమరుల స్ఫూర్తితో విద్యా కాషాయకరణను ప్రతిఘటిద్దాం…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :జెన్ జీ ఉద్యమాలకు దేశవ్యాప్తం మద్దతును కూడగడుదాం. నవంబర్ 5 నుండి 11 వరకు...

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం.. ప్రజాస్వామ్యంలో పాలకులను గద్దెనెక్కించేది ప్రజల సంక్షేమాన్ని కాపాడటం కోసం, వారి జీవనోపాధిని...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*గుంటూరు దుగ్గిరాల మండలంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ...
error: Content is protected !!