ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

📰 Generate e-Paper Clip

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రారంభించిన

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: వనపర్తి పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన బ్యాంకు శాఖను ప్రారంభించి, బ్యాంకు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… వనపర్తి జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కావడం సంతోషకరమని, జిల్లాలో ప్రారంభమైన తొలి సెంట్రల్ బ్యాంక్ శాఖగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, రైతులు, వ్యాపారులు, మహిళలు, యువతకు ఆర్థికంగా తోడ్పడేందుకు ఈ శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకు ద్వారా అందించే వ్యవసాయ రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ప్రజలకు సులభంగా అందించాలని బ్యాంకు అధికారులను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు, రుణ సదుపాయాలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా జిల్లాలో అవసరమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులకు సహకారం అందించాలని బ్యాంకు ఉన్నతాధికారులను ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించడంతో పాటు, స్థానిక అభివృద్ధికి కూడా బ్యాంకు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ హెడ్ ఎం. పిచయ్య, రీజినల్ హెడ్ జి.ఎస్. చౌహాన్, వనపర్తి బ్రాంచ్ హెడ్ రామావత్ చంద్రు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి SLN రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా జర్నల్ సెక్రెటరీ బ్రహ్మంచారి, కౌన్సిలర్లు బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్‌లో సంచలనం.. నిజాయితీకి నిలువెత్తు రూపం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

కొత్తకోట లో నవంబర్ 11 నుంచి అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ

– స్వాములు ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలోనే మధ్యాహ్న భిక్ష స్వీకరించాలి, వ్యక్తిగతం...

ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ధాన్యం కేటాయించాలి

– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, – వనపర్తి జిల్లా...

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా...

Related Articles

ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ధాన్యం కేటాయించాలి

– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, – వనపర్తి జిల్లా అదనపు కలెక్టరుకు రాచాల వినతి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

దేవరకద్ర నియోజకవర్గం లోని పలు అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

– కొత్తపల్లిలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, – అజ్జకొల్లు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం, ఆత్మకూరులో ఎం జి1 ఈవీ వెహికల్స్...

ప్రభుత్వ విద్యకు మహర్దశ.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత.. విద్యాశాఖకు రూ.20 వేల కోట్ల కేటాయింపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!