
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :
జెన్ జీ ఉద్యమాలకు దేశవ్యాప్తం మద్దతును కూడగడుదాం.
నవంబర్ 5 నుండి 11 వరకు విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభల సందర్భంగా ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో
బొజ్జాయిగూడెం గ్రామ శివారు ప్రాంతం (కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లు అమరత్వం పొందిన స్థలం) వద్ద జిల్లా కమిటీ అధ్వర్యంలో అమరుల చిత్ర పటనికి పూల మాల వేసి,
PDSU బిగి పిడికిలి జెండ ఎగురవేసి విప్లవ జోహర్లు అర్పిచడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ సాంబ మాట్లాడుతూ…
శాస్త్రీయ విద్యాసాధనకై, సమసమాజ లక్ష్యంతో కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వం తర్వాత ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం చేస్తూ బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి కృషి చేస్తున్న క్రమంలో నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ చీకటి కాలంలో 1974 నా నవంబర్ 5 నా పి.డి.ఎస్.యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు, మాజీ MLC నీలం రామచంద్రయ్య లను విజయవాడలో అరెస్టు చేసి నాడు చీకటిగండ్ల అడవి గా పిలిచే నేటి ఇల్లందు – కొత్తగూడెం ప్రధాన రహదారి అయిన బొజ్జయిగూడెం గ్రామ శివారు ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా కట్టు కథలు అల్లారు. వారి అమరత్వ స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థి వీరులు విద్యార్థి హక్కులకై, విద్యా రంగంలో మౌలిక వసతుల ఏర్పాటుకై, శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడుతూ అసువులు బాసారు. వారందరికీ పరీక్షల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పేరుపేరునా విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు.
నాటికి, నేటికి దేశంలో ప్రభుత్వాలు మారాయి తప్ప పరిపాలన ఒకే విధంగా కొనసాగుతుందని నాటి ఫాసిస్టు విధానాలు నియంతృత పోకడ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మరింత తీవ్రంగా అమలు చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగానికి మతం పులుమ చూస్తుందని, జ్యోతిష్యంలో డిగ్రీల పేరిట విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తొలగిస్తూ, మూఢనమ్మకాలను పెంచి పోషిస్తుందని, కేంద్ర విశ్వవిద్యాలయాలను అరాచకాలకు అడ్డలుగా మారుస్తుందని, రాష్ట్ర విశ్వవిద్యాలయాల హక్కులను కాలరాస్తూ విశ్వవిద్యాలయాలను నీరుగారుస్తుంది అని, పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులను ఇస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని, విద్యారంగం తో పాటు దేశ ప్రజల మౌలిక కనీస హక్కులను కాలరాస్తూ నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తుందని అందుకుగాను విద్య కాషాయకరణను, దేశంలో కొనసాగుతున్న మతోన్మాద పాలనాను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను ఉదృతం చేయాలని, ఇదే క్రమంలో
నేడు దేశవ్యాప్తంగా యువత చేస్తున్న జెన్ జీ ఉద్యమానికి దేశ ప్రజల మద్దతును కూడాకడుతూ మరింత బలమైన జెన్ జీ ఉద్యమానికి కృషి చేయాలని అందరికీ సమానమైన, ఒకే రకమైన విద్యకై, శాస్త్రీయ విద్యా విధానంకై, అమరుల త్యాగస్పూర్తితో విద్యార్థులు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అదే అమరవీరులకు నివాళి అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నాయకులు చరణ్వీర్ సింగ్ జె.నికిల్. మహేష్. అరవింద్. కుమార్. అంజలి. నవ్య. చరణ్య. తదితరులు పాల్గొన్నారు.

