ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

జగ్గయ్యపేట ZPTCగా మండవ శ్రీనివాస్ ఘన విజయం! 1,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మండవ

📰 Generate e-Paper Clip

 

 పొలిటికల్ పవర్  ప్రతినిధి  జగ్గయ్యపేట :

కృష్ణ  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన జగ్గయ్యపేట మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికల్లో మండవ శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ లెక్కింపు ప్రక్రియలో తన సమీప ప్రత్యర్థిపై 1,108 ఓట్ల మెజార్టీతో ఆయన విజేతగా నిలిచారు.

రౌండ్ రౌండ్ కూ ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చిన శ్రీనివాస్, ప్రారంభం నుంచే స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లారు. చివరి రౌండ్ ముగిసేసరికి 1,108 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంతో ఆయన విజయం ఖరారైంది.

ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు: విజయం అనంతరం మండవ శ్రీనివాస్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో గెలిపించిన జగ్గయ్యపేట మండల ప్రజలకు, తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలోని ప్రతి గ్రామాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, నియోజకవర్గాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

శ్రీనివాస్ విజయం పట్ల ఆయన మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ మండలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Latest Articles

లోకకల్యాణ సంకల్పం – విశేష అర్చనలు

 ముందుగా ఘంటామఠంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమం నిర్విఘ్నంగా...

అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో నాలుగవ వార్డు. 15వ వార్డులో సీసీ రోడ్లు...

హైదరాబాద్‌పై కమ్ముకొస్తున్న కాలుష్య ముప్పు:  మరో ఢిల్లీగా మారుతుందా?*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర...

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధిఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం...

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి

 మహబూబాబాద్ (పొలిటికల్ పవర్):  మాలోత్ అజయ్ నాయక్ (గార్ల )మహబూబాబాద్ జిల్లా...

Related Articles

లోకకల్యాణ సంకల్పం – విశేష అర్చనలు

 ముందుగా ఘంటామఠంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించారు. అనంతరం ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో వరుసగా విశేష అభిషేకాలు, దివ్య పుష్పార్చనలు ఘనంగా...

హైదరాబాద్‌పై కమ్ముకొస్తున్న కాలుష్య ముప్పు:  మరో ఢిల్లీగా మారుతుందా?*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ​భారతదేశ సాంస్కృతిక, పారిశ్రామిక నగరాలలో ఒకటైన...

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధిఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జెడ్పీటీసీ సభ్యునిగా ఇటీవల పోటీ చేసి, ఈ నెల 7వ తేదీన వెలువడిన ఫలితాల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్...
error: Content is protected !!