ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ


పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09)

 

అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, జూపల్లి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ ఈ. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు రహదారి సౌకర్యంతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మ రాంబాబు, 4వ వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ, నక్క రాంబాబు, మోర్ల వెంకన్న, కర్నాటి శ్రీను, వలి పాషా, కానూరి మోహన్ రావు, గుడపాటి గోవిందు, ఎస్.కె. ఫకీర్, ఎస్.కె. షరీఫ్, ఎస్.కె. కిషోర్, కట్ట శ్రీనివాసరావు, కట్టా రాంబాబు, ఆరేపల్లి పెద్దోడు, గున్నం కిషోర్, దండా బత్తుల రమేష్, మట్లకుంట కామేష్, ఆరేపల్లి నాగేంద్ర, ఉలవల మురళీకృష్ణ, నల్లబోతుల నాగు, నల్లబోతుల శ్రీను తదితరులు, 4వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

 

అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Latest Articles

బలీదుపల్లి గ్రామ సంఘం VOAగా శ్రీధర్‌ను తిరిగి నియమించాలి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసే...

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన పొలిటికల్ పవర్...

వ్యాపారంలో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య నవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

దండేపల్లిఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్ పవర్...

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్...

Related Articles

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్...

వ్యాపారంలో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య నవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్ పేట పట్టణంలోని మస్తాన్ కూడా చెందిన బెడద శ్రీనివాస్ అనే 47 సంవత్సరాల వ్యక్తి...

దండేపల్లిఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్దండేపల్లి మండల ఆర్‌ఎంపీ–పీఎంపీ సంఘం అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ . ప్రధాన కార్యదర్శి...
error: Content is protected !!