ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ సురేష్ నాయక్… రానున్న రోజులో బంజారా ప్రజల సంక్షేమం కోసం, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

 

సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణరాష్ట్రఉపాధ్యక్షుడిగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీపరిధిలోనిదేశ్యతండాకు చెందిన మాలోత్ సురేష్ నాయక్ నియమితులయ్యారు. బంజారా సమాజ ఐక్యత, సంఘం అబివృద్ధి, సామజిక అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ నియామకం చేపట్టినట్లు సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే. మోతిలాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్బంగా సురేష్ నాయక్ కు నియామక పత్రాన్ని అందజేశారు. నూతన బాధ్యతలు స్వికరించిన మాలోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కే. మోతిలాల్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బంజారా ప్రజల సంక్షేమం కోసం, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. సురేష్ నాయక్ నియామకం పట్ల బంజారా నాయకులు, తండావాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష

​ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర...

ముత్యాలమ్మ ఆలయానికి విరాళం.. ఆదివాసీ గ్రామాల రహదారిపై గళమెత్తిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం...

Related Articles

సాయి ఎక్సలెంట్ పాఠశాలల్లో చెకుముకి సైన్స్ సంబురాలు  జనవిజ్ఞాన వేదిక. వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా ఉపాధ్యక్షులు బలరాం.                 

 జూలూరుపాడు నవంబర్ 11: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని అన్ని పాఠశాలల్లో చెకుముకి సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్లు.జనవిజ్ఞాన వేదిక...

ప్రజల మధ్యలోనే కాంగ్రెస్ నాయకత్వం: దానవాయిగూడెంలో మార్మోగిన శుభకార్యాలు.. పాల్గొని ఆశీర్వదించిన చల్లా కృష్ణ!

  ఖమ్మం (పాలేరు) / ప్రత్యేక ప్రతినిధి: నాగరాజు రెడ్డిప్రజల కష్టసుఖాల్లోనూ, శుభకార్యాల్లోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్ దానవాయిగూడెం...

రైతు పంట అంటేనే మన బతుకు! విత్తనం మీద హక్కు రైతుదే.. భూమిపై హక్కు రైతుదే.. పంటపై అధికారం రైతుదే! 36వ అఖిల భారత కిసాన్ మహాసభలకు అంకితం… ...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. ఆ...
error: Content is protected !!