ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది

📰 Generate e-Paper Clip

– రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తుంది, వ్యవసాయ యాంత్రీకరణ పథకంద్వారారైతులకుఅవసరమైనయంత్రాలను, పరికరాలను, విత్తనాలను అందించాం,

– బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను కొల్లగొట్టి నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం,
– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.12.2026.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తుందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకుఅవసరమైనయంత్రాలను, పరికరాలను, విత్తనాలను అందించామని,బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను కొల్లగొట్టి నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని  దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.బుధవారం
దేవరకద్ర నియోజకవర్గం లోని వనపర్తి జిల్లా
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్స్‌లో నూతనంగా నియమితులైన కొత్తకోట, పామాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి  మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకివచ్చినప్పటినుంచిరైతులసంక్షేమానికిఅత్యంతప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీఅమలుచేసి,లక్షలాదిరైతుకుటుంబాలకుఆర్థికఉపశమనం కల్పించామని పేర్కొన్నారు. రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తుందని, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అవసరమైన యంత్రాలను, పరికరాలను, విత్తనాలను అందిస్తూ రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.కాంగ్రెస్,ప్రజాప్రభుత్వంవ్యవసాయరంగఅభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి రైతుకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సహకార సంఘాల నాయకులపై ఉందని అన్నారు.పార్టీకి కష్ట కాలంలో పనిచేసిన వారిని, పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని గుర్తించి నూతనంగా చైర్మన్లు గా, డైరెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి వరుస క్రమంలో పదవులు దక్కుతాయని అన్నారు.నూతనంగా నియమితులైన పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు పదవులను కేవలం హోదాలుగా భావించకుండా రైతులకు సేవ చేసే బాధ్యతగా భావించాలని అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని, ప్రభుత్వం అందించే వ్యవసాయ సబ్సిడీలు అర్హులైన రైతులందరికీ చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను కొల్లగొట్టి నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం గా ఉన్నదని వెయ్యేళ్లకు సరిపడా రాష్ట్ర సంపదను దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ గత పాలకులదని, నేడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి,అభివృద్ధినిఅటకెక్కించిననాయకులునేడుకాంగ్రెస్,ప్రభుత్వాన్నివిమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత పాలకులు చేయలేని అభివృద్ధి, ప్రజలకు అందించలేని సంక్షేమాన్ని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కొక్కటిగా సాకారం చేస్తోందని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.పదేళ్ల విధ్వంసానికి బాధ్యత వహించకుండా నేటి అభివృద్ధిపై విమర్శలా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదయ్య,మదనాపూరం మార్కెట్ యార్డ్,మాజీ.ఛైర్మెన్ పల్లెపాగు ప్రశాంత్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పాపయ్య గారి పల్లవి కృష్ణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, మాజీ జెడ్పిటిసి పి జె. బాబు, మండల ఉపాధ్యక్షులు సలీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శలు పి. కృష్ణారెడ్డి , ఎన్ జె. బో హెజ్, కొత్తకోట పట్టణ మాజీ అధ్యక్షులు మేస్త్రి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి,
సిడిసి చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి,మాజీ సి డి సి చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు జె. అఖిల తండ్రి  సుభాష్, పుచ్చలపల్లి సుధ రామ్మోహన్ రెడ్డి, ఎన్ జే. బోయెజ్, భీమ చంద్ర కాంత్, రామ్ రెడ్డి, అస్మత్ ఖాన్ సలీం ఖాన్,కరాటే అబ్దుల్ నబి,  సర్పంచుల సంఘం అధ్యక్షులు మాసన్న,మాజీ కో ఆప్షన్ సభ్యులు జే యం.మిషేక్, మూలమల్ల వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబ్, కొత్తకోట మైనార్టీ అధ్యక్షులు ఎజాస్ అలీ, మాజీ వార్డు సభ్యులు నరేంద్ర సాగర్, దేవరకద్ర అసెంబ్లీ అధ్యక్షులు ముస్తఫా, పి. రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మోహన్ రెడ్డి, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ బి. శివరాములు, అమడ బాకుల మాజీ సర్పంచ్ జి శ్యాంసుందర్ గౌడ్, ఫిషర్ మ్యాన్ సందా వెంకటేష్, సింగల్ విండో డైరెక్టర్, సర్పంచ్ రామ్ లాల్ నాయక్,బూత్కూర్.సర్పంచ్,బంగారయ్య,గోకరయ్య,సాయిల్ యాదవ్,మహమ్మద్ ఖలీల్, ఎండి. ఫెరోస్,  లతీఫ్, సుల్తాన్, భాస్కర్, రాములు యాదవ్, ముంత లక్ష్మయ్య యాదవ్, నా గబుచ్చన్న నాయుడు, భాస్కర్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపుపొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద...

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష

​ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.12.2026.వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర...

సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కేఎల్ఐ, జూరాల నీటి విడుదల కోసం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నా రైతులకు సాగునీరు అందించరా? – మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

అక్రమార్కులు దౌర్జన్య పరుల పట్ల కొత్తకోట ఎస్సై.విక్రమ్ ఉక్కు పాదం

– జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ప్రారంభించి,అమాయకులైన హోటల్లా యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తు డబ్బులు వసూళ్ళు,– చిన్నచిన్న హోటళ్ళు నడుపుకుంటున్న అమాయక యాజమాన్యాలే టార్గెట్ చేసుకున్న...
error: Content is protected !!