పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్12: మండల కాంగ్రెస్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర పూజ పీఠంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు.
పీఠం గురుస్వామి తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పీఠంలోని అయ్యప్ప స్వాములకు నారాయణ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములకు భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమం చేపట్టారు.
అనంతరం జన్మదిన వేడుకల్లో భాగంగా పర్వతనేని వరప్రసాద్ కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గురుస్వాములు, అయ్యప్ప స్వాములు వరప్రసాద్ కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో సాదరంగా సాగింది.

