ePaper
Friday, November 13, 2026
📄 ePaper

ఎన్నికల అవగాహన పోటీల్లో అశ్వారావుపేట విద్యార్థుల విజయభేరి!

📰 Generate e-Paper Clip

వ్యాసరచనలో జీషన్‌కు ద్వితీయ స్థానం.. క్విజ్‌లో సహస్రకు తృతీయ స్థానం

ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రిన్సిపల్, అధ్యాపకుల అభినందనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: విద్యతో పాటు విజ్ఞానం.. పోటీల్లో ప్రతిభతో విజయమే లక్ష్యంగా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో బహుమతులు సాధించి కళాశాల కీర్తిని చాటారు. ఈ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఎండీ జీషన్ (CEC ప్రథమ సంవత్సరం) వ్యాసరచనలో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ కనబరిచారు. అలాగే డి. సహస్ర (MPC ప్రథమ సంవత్సరం) క్విజ్ పోటీల్లో తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.

విజయాల వెనుక విద్యార్థుల కృషి.. కళాశాల ప్రోత్సాహం!

విద్యార్థులు సాధించిన విజయాలపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఏ. అనిత, స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్.కే. సాహెదతో పాటు అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీల్లో బహుమతులు సాధించడం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలపై అవగాహనతో విద్యార్థులు ముందుకు సాగడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Latest Articles

మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు!

డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై...

ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర… శత్రుచర్ల విజయరామరాజు! ఒక రాజకీయ ప్రస్థానం.. ఎన్నో పదవులు.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం!

పొలిటికల్ పవర్   విజయనగరంఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, కొన్ని వ్యక్తిత్వాలు కేవలం...

Related Articles

*మనిషి గొప్పతనం ఆడంబరాల్లో కాదు.* *ఆలోచించి మాట్లాడటంలో ఉంటుంది.*  " *అరంగుళం నాలుక"* *మీద ఆధారపడి ఉంటుంది.* *ఎంత అందమైన రూపమైనా, మాట తీరు బాగుంటేనే విలువ.* *ఎందుకంటే మనిషిని పరిచయం చేసేది రూపం అయితే...* *గుర్తుండిపోయేలా చేసేదిమాటే* ... *డబ్బు ఉంటే...* *దేవుడు...

అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో నాలుగవ వార్డు. 15వ వార్డులో సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరిగింది కార్యక్రమం భాగంగా పైపులు లీకేజీ అవుతూ ఉండటంతో తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే మా వీధిలోకి...

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ మరియు డ్రైనేజీలు పనులను ప్రారంభించడానికి మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్...
error: Content is protected !!