ePaper
Friday, November 13, 2026
📄 ePaper

మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు!

📰 Generate e-Paper Clip

డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డి హెచ్చరిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: అశ్వారావుపేట మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అశ్వారావుపేట ఎస్సై బి. సాయి కిషోర్ రెడ్డి తల్లిదండ్రులను హెచ్చరించారు. 18 ఏళ్లు నిండని పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ:- మైనర్లకు బైక్‌లు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.

– వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

– మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

– హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం సహించేది లేదు.

– మైనర్ల చేతుల్లో వాహనాలు పెట్టి ప్రమాదాలకు కారణం కావద్దు.

తల్లిదండ్రులకు ప్రత్యేక హెచ్చరిక!

పిల్లలపై ప్రేమ ఉంటే వారి చేతికి మైనర్ల డ్రైవింగ్‌కు చెక్.. రోడ్డు భద్రతే లక్ష్యం!బైక్ తాళాలు ఇవ్వడం కాదు.. వారి భద్రతకు బాధ్యత తీసుకోవాలని ఎస్సై సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

Latest Articles

ఎన్నికల అవగాహన పోటీల్లో అశ్వారావుపేట విద్యార్థుల విజయభేరి!

వ్యాసరచనలో జీషన్‌కు ద్వితీయ స్థానం.. క్విజ్‌లో సహస్రకు తృతీయ స్థానం ప్రతిభ చాటిన...

ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర… శత్రుచర్ల విజయరామరాజు! ఒక రాజకీయ ప్రస్థానం.. ఎన్నో పదవులు.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం!

పొలిటికల్ పవర్   విజయనగరంఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, కొన్ని వ్యక్తిత్వాలు కేవలం...

Related Articles

తొలితరం ఎమ్మార్పీఎస్ రెండు జిల్లాల కమిటీల ఏకగ్రీవ ఎన్నిక!  * ఖమ్మంలో ఘనంగా తొలితరం ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల సమావేశం  * 30 ఏళ్లుగా ఉద్యమంలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకుల...

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)...

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలే లక్ష్యం: సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ మాధవరావు  * ములకలపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక  * బిల్లుల హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ, వ్యవసాయ సర్వీసులపై...

ములకలపల్లి (అశ్వారావుపేట), నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - ఆర్సీ కారం వెంకటేష్):విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వినియోగదారుల...

తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా!  * నవంబర్ 19న సిద్దిపేట సభలో ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి  * కుటుంబ పెద్ద...

నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే...
error: Content is protected !!