జూలూరుపాడు, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ – పొలిటికల్ న్యూస్ 9 తెలుగు టీవీ ):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో గురువారం ‘విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్’ (ప్రైవేటు సంస్థ) ప్రతినిధుల బృందం పర్యటించింది. గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి, సాగునీటి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
భూగర్భ జలాల సంరక్షణే లక్ష్యం:
గ్రామంలో భూగర్భ జల మట్టాలను పెంపొందించేందుకు అవసరమైన చర్యలపై ఫౌండేషన్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గ్రామ పరిధిలోని చెరువులు, కుంటల పునరుద్ధరణతో పాటు నూతన చెక్ డ్యామ్‌లు, ఫాం పాండ్స్ (పంట కుంటలు) తదితర నీటి సంరక్షణ పనులను అత్యాధునిక యంత్రాల (మిషనరీ) ద్వారా ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని వారు వెల్లడించారు.
పాల్గొన్న వారు:
ఈ పరిశీలన కార్యక్రమంలో అనంతారం సర్పంచ్ కొర్సా రమేష్, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఎఫ్‌ఏ నాగమణి, ఫౌండేషన్ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

