ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పెద్దమందడి సింగిల్ విండో సీఈఓ జగదీశ్వర్ రెడ్డిని సన్మానించిన వెల్టూర్ నాయకులు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026:
వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈఓ జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా వెల్టూర్ గ్రామ నాయకులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామానికి చెందిన నాయకులు, రైతులు కలిసి జగదీశ్వర్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో రైతులకు అందుబాటులో ఉంటూ నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని వెల్టూర్ గ్రామ నాయకులు ఆకాంక్షించారు.తమకు ఎల్లప్పుడూ సహకరించిన జగదీశ్వర్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సి. వెంకటేశ్వర్లు, రఘువర్ధన్ రెడ్డి, బుసయ్య, రవీందర్, చిత్తూరు కృష్ణారెడ్డి, కుమ్మరి కొండన్న, నాగరాజుగౌడ్, మెరుగు కుర్మయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

Related Articles

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో...

రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయ సమస్యలు పరిష్కరించాలి వాల్మీకి బోయిలకు రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లలో చోటు కల్పించాలి వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలి వాల్మీకి బోయిలను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలి హైదరాబాద్ ట్యాంక్...

అన్నదాతలకు అధైర్యం వద్దు,  చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం, పెబ్బేరు, శ్రీరంగాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!