ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వనపర్తి మున్సిపల్ లో థై బజార్ రద్దు
వనపర్తి పట్టణ అభివృద్ధి ప్రజా ప్రభుత్వం ధ్యేయం
వనపర్తి మున్సిపల్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ 02 మే 2026: మార్కెట్ రుసుము వసూలను రద్దు చేస్తున్నట్లు శనివారం రోజు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. వనపర్తి మున్సిపల్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని మున్సిపల్ సర్వసభ సమావేశాల కీలక అంశాలు గురించి ప్రస్తావన తీసుకువచ్చి పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, పన్నులు, వార్షిక బడ్జెట్, ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్ సంబంధ సమస్యలు, వంటి కీలకమైన పట్టణ నిర్వహణ అంశాలపై చర్చించారు. వనపర్తి పట్టణ అభివృద్ధి పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. వనపర్తి పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు అధికారులు అందరు కట్టుబడి పని చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!