ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ధాత్రి సేవలు – ప్రజాహితానికి చిరస్మరణీయ మార్గదర్శకం: సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ప్రశంసలు

ధాత్రి సేవలు – ప్రజాహితానికి చిరస్మరణీయ మార్గదర్శకం: సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ప్రశంసలు

📰 Generate e-Paper Clip

– వేసవిలో ప్రజల దాహార్తి తీర్చే మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

– స్వర్గీయ సబ్బెళ్ళ సురేష్ రెడ్డి స్మారకార్థం సేవా కార్యక్రమాలు

 – ధాత్రి ట్రస్ట్ సేవలకు ప్రజల నుండి విశేష ఆదరణ భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష

– సమాజ సేవలో యువత ముందుండాలని పిలుపు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 02

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: సేవనే  పరమ ధర్మమని నిరూపిస్తున్న “ధాత్రి” చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి  అన్నారు.

అనపర్తి కెనాల్ రోడ్‌ వద్ద స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహం నందు ధాత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వర్గీయ సబ్బెళ్ళ సురేష్ రెడ్డి జ్ఞాపకార్థం అతని స్నేహితులు ఏర్పాటు చేసిన ‘ధాత్రి’ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు మేలుచేస్తున్నాయి. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు ఎంతో అవసరం. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.

“ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. భవిష్యత్తులో కూడా ధాత్రి ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆశీస్సులు పొందాలి” అని సబ్బెళ్ళ కృష్ణారెడ్డి  ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు; అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షులు కొండేటి భీమేశ్వర స్వామి, ధాత్రి చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు చింతా ప్రభాకర్ రెడ్డి, మల్లిడి శివారెడ్డి, సత్తి మణికంఠ రెడ్డి, గుడిమెట్ల బాలదేవి మణికంఠ రెడ్డి, సత్తి వెంకటరెడ్డి, పోతంశెట్టి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!