*గంగపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నిక*

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ సింగరాయిపేట్ గ్రామంలో గంగపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సింగరాయపేట నూతన పాలకవర్గని సంఘ ఆవరణ తపాల్ పూర్ లో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాఖపురం రాజయ్య ఉపాధ్యక్షులుగా శాఖపురం కిష్టయ్య, కార్యదర్శిగా శాకాపురం రాజన్న తండ్రి నరసయ్య డైరెక్టర్లుగా శాఖపురం కోటయ్య, గుమ్ముల శంకరయ్య, కొండ్ర లచ్చయ్య, కొండ్ర కొండయ్య, కొండ్ర రాజయ్య, శాఖపురం రమేష్, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిక అధికారిగా శ్రీమతి నీరటి రాజేశ్వరి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జిల్లా సహకార శాఖ మంచిర్యాల గారు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షలు శాఖపురం రాజయ్య మరియు కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెరువు మరియు గోదావరి నదిలో చేపల వేటలో ఉపాధి పొందేందుకు తమ సహకారం సభ్యులందరికీ ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కుల, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
