పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 10:
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: యువజన విభాగం చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలవాలని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు.
ఆదివారం అనపర్తి కెనాల్ రోడ్‌లోని వైయస్‌ఆర్ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ పడాల దుర్గారెడ్డి (ఆర్కే) సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కుతుకులూరు మాజీ ఉపసర్పంచ్ సబ్బెళ్ళ నాగిరెడ్డి పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికులు, వివిధ పనులపై బయట తిరిగేవారు తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. మజ్జిగ చలివేంద్రాల నిర్వహణ వ్యయప్రయాసలతో కూడుకున్నప్పటికీ యువజన విభాగం ముందుండి నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సంతోషకరమని, యువత అంతా వీరి సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి ఎంపీటీసీ కొండేటి భీమేశ్వర స్వామి, కుతుకులూరు మాజీ ఉపసర్పంచ్ సబ్బెళ్ళ నాగిరెడ్డి, రైతు నాయకులు తేతల భూపారెడ్డి, యువజన, విద్యార్థి విభాగ నాయకులు సత్తి మణికంఠ రెడ్డి, సత్తి వెంకట రెడ్డి, సత్తి సత్యనారాయణరెడ్డి, గుడిమెట్ల బాలదేవిమణికంఠ రెడ్డి, చింతా ప్రభాకర్ రెడ్డి, ఎన్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
