ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపెంటన్నయాదవ్‌ను పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పెంటన్నయాదవ్‌ను పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 18 2026: పెద్దమందడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. పెంటన్న యాదవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చిన్నారెడ్డి, వైద్యుల సూచనలను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకొని త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు, సీనియర్ నాయకులు ఎంట్ల రవి పెంటన్న యాదవ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!