ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

భూ బకాసురుడు లింగం లీలలు బాగోతం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.

                                                               పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం రెవిన్యూ లో భూ బకాసురులు పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అసైన్మెంట్ ల్యాండ్ ని వెంచర్ గా మార్చి ఫ్లాట్లు చేసి ప్రజలకు ఒక్కొక్క ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురు కు అమ్మిన వైనం అయినా చోద్యం చూస్తున్న రెవెన్యూ పోలీస్ యంత్రాంగం దీని వెనక ఉన్నది ప్రభుత్వ సైన్మెంట్ ల్యాండ్ ను కబ్జా చేసి ఫ్లాట్లుగా అమ్మిన వ్యక్తిని ఎవరు కాపాడుతున్నారు బాధితులు కేసులు పెట్టినా కూడా పట్టించుకోని ఖమ్మం రూరల్ ఏసిపి ఎందుకు ఇలా జరుగుతుంది దీని కారణం ఎవరు ప్రభుత్వం భూమిని ఫ్లాట్లుగా మార్చి సర్వే నెంబర్ ని తప్పుగా చూపిస్తూ అమాయకులకు అమ్మిన వ్యక్తులను ఎందుకు పోలీసు వారు కాపాడుతున్నారు ఒకే రకమైన కేసులు ఐదు కేసులు ఉంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి మీద పిడి యాక్ట్ పెట్టాలని చట్టంలో ఉంది కదా ఎందుకు పెట్టట్లేదు అంటే దీని వెనక ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లు చేసి అమ్మిన వ్యక్తులను వెంటనే కస్టడీలోకి తీసుకొవాలి కొసమెరుపు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బాధితులున్నారు ఎస్టీ, ఎస్టీ లు కేసులు కూడా పెట్టాలని అమాయకుల ప్రజలు వాపోతున్నారు లింగం నీ వెనకున్నది ఎవరు ? 10 సంవత్సరాల నుంచి ఈ తత్తంగమంతా నడుస్తుంటే ప్రభుత్వ అధికారులు రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందా లేక వాళ్లకు అందవలసినవి అందుతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు రాకుండా వ్యవహరిస్తున్నారు అని బాధితుల బోగట్ట బాధితులు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చానా కూడా పోలీసు వారు చర్యలు శూన్యం మరియు మరో విషయం ఏంటంటే ఇదే భూమిని ఒక్కొక్క ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేశారు వారందరూ ఇప్పుడు లబోదిబోమంటున్నారు అయినా ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు ముదిగొండ మండలం రెవెన్యూ అధికారులు ముదిగొండ మండలం పోలీస్ యంత్రాంగం అలాగే ఖమ్మం రూరల్ ఏసిపి ఏం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఈ తత్తంగమంతా నడుస్తున్నప్పుడు ల్యాండ్ కన్వర్షన్ అని లేదా ల్యాండ్ అక్వేజేషన్ అని లేదంటే ల్యాండ్ మార్కింగ్ అని చెప్పి ప్రజలను చాలా కోర్రిలు పెట్టే ప్రభుత్వ అధికారులు ఈ విషయం వాళ్ళ దృష్టికి రాలేదా వెళ్లలేదా వెళ్లిన మాకు అవసరం లేదని చేతులు దులుపుకున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది కొసమెరుపు ఏంటంటే ముదిగొండ మండలం ఎమ్మార్వో మా దృష్టికి ఈ విషయం రాలేదండి అని అంటున్నారు వారికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయా అది సాధ్యమా కబ్జాదారుడు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సువర్ణాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 399లో 0.24 కుంటల అసైన్మెంట్ భూమి పట్టా ఇచ్చింది.ఈ భూమి ఆనుకొని ఉన్న 400 సర్వే నెంబర్ వెంకటగిరి గ్రామానికి చెందిన రేఖం లింగరాజు అలియాస్ లింగయ్య అనే వ్యక్తి తన భూమిలో వెంచర్ వేసి పక్కనే ఉన్న మహమ్మద్ రెహనా సుల్తానా వైఫ్ ఆఫ్ అజ్గర్ భూమిని కూడా కలుపుకొని వెంచర్ వేసి అమ్ముకున్నాడు ఇది తెలుసుకొని బాధితులు గత పది సంవత్సరముల నుంచి తమ భూమి లోకి రానివ్వకుండా అక్రమ కబ్జాదారుడు పట్టాదారులను అడ్డుకుంటున్నాడు గత పది నెలల క్రితం తన భూమిని బాధితులు బౌండరీ చేసుకుంటే సదరు వ్యక్తి తన అనుచరులతో వచ్చి పట్టాదారులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసినాడు అసైన్మెంట్ 24 గుంటల భూమి అక్రమంగా కలుపుకొని నక్షాలో వేరేచోట ఉంది మీ భూమి అని అసైన్మెంట్ భూమిని వెంచర్లో తన భూమిలొ కలుపుకొని హద్దులు పెట్టుకున్నాడు ఈ భూమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ లు చెందినది 24 కుంటల అసైన్మెంట్ భూమిని తన భూమిలో కలుపుకున్నాడు లో 20 మంది బాధితులు ఉన్నారు 399 సర్వే నెంబర్ గల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ వేరే వాళ్లకు చేశాడు మరో విషయం ఏంటంటే అసైన్మెంట్ లబ్ధిదారులకు తప్ప వేరే వాళ్ళకి అమ్మకూడదు కొనకూడదు రిజిస్ట్రేషన్ చేయకూడదని చట్టంలోనే ఉంది ఇది వెంచర్ వేసి అమాయకులకు ఫ్లాట్ల అమ్మి సొమ్ము చేసుకున్నాడు ఫ్లాట్లు కొన్న సదరు వ్యక్తులు అందరూ ఫ్లాట్లు దగ్గరికి వెళ్ళగా అసలు పట్టాదారులొచ్చి ఇది గవర్నమెంట్ భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది మీరెవరు ఇక్కడ ఆ ఫ్లాట్లు కొనటానికి అని తెలియజేసినప్పుడు ఫ్లాట్లు కొన్న వ్యక్తులకు తెలిసింది అసలు విషయం వారికి తెలిసిన తరువాత ఏం చేయాలో అర్థంకాక లబో దీబో అంటూ ఎవరిని కలవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముదిగొండ మండల ఎమ్మార్వో అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అసైన్మెంట్ ల్యాండ్ పట్టా ఉన్నవారికి అప్పగించాలని బాధితుల భూమిని వెంచర్ గా మార్చిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని పీడీ యాక్ట్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ముదిగొండ ఎమ్మార్వో ని పొలిటికల్ పవర్ దినపత్రిక ప్రతినిధి సంప్రదించగా ఈ విషయాలు ఏవి మా దృష్టికి రాలేదని చెప్పటం కోసం మెరుపు

Latest Articles

రేవల్లి మండలంలో ఘనంగా పాఠశాల క్రీడా పోటీలు

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌లో విద్యార్థుల ఉత్సాహభరిత పోటీలు పొలిటికల్...

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులుసెప్టెంబర్ 19...

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా

పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను...

Related Articles

రైజింగ్ సన్ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం మరియు రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు ప్రదానం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిపెద్దపల్లి పట్టణంలోని స్థానిక *రైజింగ్ సన్ పాఠశాలలో* ఈరోజు...

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల వెంకయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ మరియు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40...
error: Content is protected !!