ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంశాంతి సందేశం చాటిన బక్రీద్ పండగ

శాంతి సందేశం చాటిన బక్రీద్ పండగ

📰 Generate e-Paper Clip

త్యాగానికి పత్రిక గా బక్రీద్ పండుగ, భక్తిశ్రద్ధలతో బక్రీద్ నమాజ్ 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 29) అశ్వారావుపేట లో ముస్లింల పవిత్ర పండుగ అయిన బక్రీద్‌ను పట్టణం మరియు గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మసీదులకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు ఆహారం, వస్త్రాలు పంపిణీ చేస్తూ దాతృత్వ భావనను చాటుకున్నారు. చిన్నారులు కొత్త దుస్తుల్లో సందడి చేయగా, పండుగ వాతావరణం ఆనందోత్సహాల,తో కళకళలాడింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!