ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

లక్షల జీతం కంటే మనశ్శాంతే ముఖ్యమని ఐటీ ఉద్యోగానికి గుడ్‌బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితం!

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

బెంగళూరు, మే 31, 2026

ఈరోజుల్లో ఐటీ ఉద్యోగం అంటే లక్షల జీతం, ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులు, విలాసవంతమైన జీవితం అనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఆ మెరుపుల వెనక ఉన్న ఒత్తిడి, టార్గెట్లు, రాత్రింబవళ్లు పని చేసే పరిస్థితులు ఎంతమందిని మానసికంగా అలసటకు గురి చేస్తున్నాయో తాజాగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చెబుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లోనే బెంగళూరుకు చెందిన ఓ మహిళ ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో మంచి జీతం వచ్చినా, మానసిక ప్రశాంతత మాత్రం దొరకలేదని తెలిపింది. రోజుకు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, నిరంతర ఒత్తిడి, టార్గెట్లు, మీటింగ్స్ వల్ల తీవ్ర మానసిక అలసటకు గురయ్యానని పేర్కొంది. దీంతో తన జీవితాన్ని తాను నియంత్రించుకునేలా కొత్త మార్గాన్ని ఎంచుకుందట.ఇప్పుడు ఆమె బెంగళూరు నగరంలో ఆటో నడుపుతూ తనకు నచ్చిన సమయాల్లో పని చేస్తోంది. ముఖ్యంగా యాప్ ఆధారిత ఆటో సర్వీసుల ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తూ నెలకు రూ.60 వేలకుపైగా సంపాదిస్తున్నట్లు వీడియోలో వెల్లడించింది.కార్పొరేట్ ఉద్యోగంలో డబ్బు ఉన్నా ఆనందం లేదు. ఇప్పుడు శారీరకంగా అలసట ఉన్నా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అని ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఐటీ రంగంలో పెరుగుతున్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చాలా మంది యువత ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ కోసం సంప్రదాయ ఉద్యోగాలను వదిలి తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా బెంగళూరు వంటి ఐటీ నగరాల్లో మానసిక ఒత్తిడి, బర్నౌట్ సమస్యలు పెరుగుతున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అధిక జీతాల కంటే ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయం, మనశ్శాంతి ముఖ్యమనే భావన యువతలో పెరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.ఈ మహిళ తీసుకున్న నిర్ణయం సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తోంది. జీతం మాత్రమే కాదు… మనసుకు నచ్చిన జీవితం కూడా ముఖ్యమే” అని ఆమె కథ చెబుతోంది.

Latest Articles

ఐదేళ్ల చీకట్లకు చెక్‌.. యార్లగడ్డ భాస్కర్ రావు కాలనీలో విద్యుత్ వెలుగులు

మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ఎమ్మెల్యే జారేనిరుపేదల దశాబ్దాల కల సాకారం.....

పార్కలగండి గ్రామపంచాయతీలో ఘనంగా సామూహిక శ్రీమంతం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడీల...

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

Related Articles

ప్రముఖ భారతీయ అను శాస్త్రవేత్త ఇ సి ఐ ఎల్ (ECIL) వ్యవస్థాపకుడు శాంతి స్వరూప్ బట్నాకర్ అవార్డు గ్రహీత డాక్టర్ నాయడమ్మ స్మారక బంగారు పథకం గ్రహీత పద్మబుషణ్...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఅయ్యగారి సాంబశివరావు ( Ayyagari Sambasivarao / A....

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: దమ్మపేట మండలం కొత్తూరు గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ...
error: Content is protected !!