పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల మధిర సాయమ్మ భర్త శివనాగయ్య మరణించడం జరిగింది.
ఇట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం 5000/- రూపాయలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు వార్డు సభ్యులు కృష్ణ నరేష్ శంకర్ యాదయ్య గౌడ్ పద్మమ్మ యాదమ్మ మాజీ సర్పంచ్ తిక్కన్న నాయకులు, కొంకలి నర్సింహా బీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
