ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, వనపర్తి జిల్లా బ్యూరో, జూన్ 2, 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులను స్మరించారు. కార్యక్రమంలో మాట్లాడిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అలాగే గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి గ్రామ ప్రజల తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

Related Articles

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!