ఆటో డ్రైవర్స్ సమస్యలు తీర్చాలి – ఏఐటీయూసీ డిమాండ్

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ జూలై 29)
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ మరియు ప్రైవేట్ మోటార్ వర్కర్స్ సమస్యలను తీర్చాలంటూ రాష్ట్ర ఐఐటియుసి ఆటో & ప్రైవేట్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన ఆర్టిఏ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ముందు ధర్నాలు – ఆందోళనల పిలుపులో భాగంగా ఈరోజు మంగళవారం అశ్వరావుపేట కేంద్రంలోని ఆర్టిఏ ఆఫీస్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ మోటార్ వర్కర్స్ సమస్యలు తీర్చాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇస్తున్న 12000/- ను తక్షణమే విడుదల చేయాలని, ఆర్టిఏ ఆఫీసులో ఆటోలకు రేడియం స్టిక్కరింగ్ మినహాయించాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ను తక్షణమే ఏర్పాటు చేయాలని, ఓలా ఉబర్ రాపిడో స్థానంలో ప్రభుత్వమే ఒక యాప్ ను తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆటోలకు ఈ చలాన్ ను మినహాయించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆటో డ్రైవింగ్ లైసెన్స్ సారధి వాహన పోర్టల్ లో ఆటో లైసెన్స్ ను కొనసాగించాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు వెంటనే పెంచాలి అంటూ వివిధ డిమాండ్లతో కూడిన మెమోరాండంను సమర్పించడం జరిగింది. అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్, ప్రైవేట్ డ్రైవర్ల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు షేక్ అబ్బాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ,ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు పటాన్ జలాల్, ఏఐటియుసి మండల నాయకులు దోమల అనిల్, ముత్తు, బస్టాండ్ ఆటో సెంటర్ యూనియన్ వెంకటేశ్వరరావు, ప్రవీణ్, వెంకన్న, మురార్జీ, రింగ్ రోడ్ సెంటర్ ఆటో యూనియన్ రామకృష్ణ, రాంబాబు ,హరి, మల్లేశ్వరరావు, మరియు ఏఐటియుసి మండల నాయకులు పాల్గొన్నారు..
