విచారణలో కొరవడిన పారదర్శకత!

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక న్యూస్ ఎన్విఆర్ 9 టీవీ (ఆర్సి కారం వెంకటేష్ ములకలపల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాoల్లో (కె జి బి వి) నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఉద్యోగాల ఎంపికలో పారదర్శకత లోపించిందని,ఆరోపిస్తున్నారు మెరిట్ జాబితాను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెరిట్ నంబర్ 3 ని దాటి 7వ వ్యక్తికి ఎలా వచ్చింది? కేజీబీవీ నర్సింగ్ పోస్టుల నియామకంలో మెరిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థి తనకు ఈ ఉద్యోగం వద్దని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం, మొదటి స్థానంలో ఉన్నవారు నిరాకరిస్తే తర్వాతి వరుసలో ఉన్న మెరిట్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. అయితే, ఇక్కడ మెరిట్ జాబితాలో 3వ స్థానంలో ఉన్న అర్హులైన అభ్యర్థిని కాదని, ఏకంగా 7వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం కట్టబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్హత, మెరిట్ ఉన్న అభ్యర్థులను తొక్కిపెట్టి, వెనుక ఉన్నవారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనే ప్రశ్నకు అధికారుల వద్ద సరైన సమాధానం కరువైంది. అధికారుల సమర్థన – ప్రశ్నార్థకమైన సమాధానాలు! ఈ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంపై ‘డి అర్ బి న్యూస్ ప్రతినిధి, కేజీబీవీ ఎస్ ఓ (స్పెషల్ ఆఫీసర్) ని వివరణ కోరగా, “అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే, పూర్తి మెరిట్ ప్రాతిపదికనే జరిగింది” అని తెలిపారు. అయితే అధికారుల మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. మొదటి అభ్యర్థికి మళ్లీ ఫోన్ కలు.. అసలు గుట్టు ఏమిటి? ఉద్యోగం వద్దని ముందే తేల్చిచెప్పిన మొదటి స్థానంలోని అభ్యర్థికి, అధికారులు మళ్లీ ఫోన్ చేసి “సోమవారం డెమో ఇవ్వడానికి రావాలని” చెప్పడం వెనుక ఉన్న అసలు మతలబు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒకసారి వద్దని చెప్పిన అభ్యర్థికి మళ్లీ ప్రత్యేకంగా సమాచారం అందించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఎంపిక ప్రక్రియ ముగిసిందని చెబుతూనే, మళ్లీ డెమోల పేరుతో నాటకమాడుతున్నారా..? 7వ నంబర్ అభ్యర్థి ఎంపికను కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారా? విచారణకు డిమాండ్! విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన నర్సింగ్ పోస్టుల భర్తీలో ఇలాంటి అక్రమాలు, అస్పష్టతలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో, నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించి, అర్హులైన మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

