ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

మెగా డీఎస్సీ పై సీబీఐ దర్యాప్తు చేయాలి..చల్లా సునీల్

📰 Generate e-Paper Clip

* విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
పులివెందుల నుంచి :– 2025 లో జరిగిన మెగా డీఎస్సీ పై సీబీఐ దర్యాప్తు చేయాలి అని,అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సీ అవకతవకలపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం ఉదయం పులివెందుల లోని స్థానిక ఆర్ డి ఓ (మినీ సెక్రటేరియట్) వద్ద విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపు తో వైఎస్ఆర్సీపీ ఆద్వర్యం లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో మోసపోయిన నిరుద్యోగులకు విద్యార్థులకు అండగా కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ పాల్గొన్నారు.కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షా విధానంలో అవకతవకలు, పేపర్ లీకేజీలు జరిగాయని, చాలామంది నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోయారు అని, కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా కాకుండా నైతిక బాధ్యత వహించి లోకేష్ వైదొలగాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని వారు డిమాండ్ చేశారు.అలాగే ఈ సమగ్ర వ్యవహారంపై సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని వారు కోరారు.నీట్ పేపర్ లీకేజీ ను తలదన్నే రీతిలో రాష్ట్రం లో సాగిన డీఎస్సీ-2025 కుంభకోణం పక్క సాక్ష్యాధారాలతో రుజువైన చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందన్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన గోల్ మాల్ పై ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్న బాబు ప్రభుత్వం బాధ్యత వహించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డీఎస్పీ అభ్యర్థులకు జరిగిన నష్టానికి ,యువతకి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన్ ను స్పూర్తిగా తీసుకొని వెంటనే లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు.అంతే కాకుండా ఎన్నికల సమయం లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు.విద్యార్థులకు వెంటనే ఫీజు రియింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థుల,నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం అని అన్నారు.

Latest Articles

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్...

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

సింగనమల కోటలో వైఎస్సార్‌సీపీ ‘ఫ్యాన్’ ప్రభంజనం! 🚩 బుక్కరాయసముద్రం, కొట్టాలపల్లి గ్రామాలు వైఎస్సార్‌సీపీ మయం! ➔ జగనన్న సంక్షేమ పాలనే ఆయుధంగా ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తుఫాన్ ప్రచారం!

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*‌ బుక్కరాయసముద్రం: సింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం...
error: Content is protected !!