ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

బాపట్ల ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి…!

📰 Generate e-Paper Clip

గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన
ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాలి!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్
సూర్యలంక కేంద్రకంగా పర్యాటక అభివృద్ధి కొనసాగా

ముఖ్యమంత్రి ప్రకటనను సీరియస్ గా తీసుకుని ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను ముందుకి తీసుకువెళ్లాలి!!

బాపట్ల అభివృద్ధి విషయంలో ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాను!!

మన ప్రాంత అభివృద్ధి విషయంలో భేషజాలను, వ్యక్తిగత ఈగోలను పక్కన పెడదాం!!

అవసరమైన సమయంలో కలిసికట్టుగా ముందడుగు వేద్దాం!!
………………………………
// మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్పష్టీకరణ //
…………………………………..

మన ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో, అభివృద్ధిని కొనసాగించే విషయంలో భేషజాలను వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి ముందడుగు వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్పష్టం చేశారు.

మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చీరాల పర్యటనలో ప్రస్తావించిన “సూర్యలంక అభివృద్ధి” మరియు
“ఎయిర్పోర్ట్ మంజూరు” అనే అంశాలను స్వాగతిస్తూ , సానుకూలంగా స్పందించారు.

సూర్యలంక సముద్ర తీరం సహజ వనరులతో సుందరంగా, శోభాయమానంగా అలారారుతున్నదని, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పర్యాటకం విరాజిల్లుతున్నదని గుర్తు చేశారు.

దీనిని కొనసాగిస్తూ సూర్యలంక పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం ముదావహం అన్నారు.

గతంలో తాము సూర్యలంక తీరం అభివృద్ధి విషయంలో క్షేత్రస్థాయి వరకు వెళ్లి పనిచేసిన, ప్రతిపాదించిన అనేక అంశాలను ఆడియోలు, వీడియోలు, ప్రతిపాదన పత్రాలను ప్రదర్శించి వివరించారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అత్యంత అనుకూలమైన జాతీయ భద్రత మరియు జాతి ప్రయోజనాలు ముడిపడి ఉన్న సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిసరాలను మరియు దానికి అనుకొని ఉన్న ఇసుకపర్ర భూములను ఒకసారి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

150 మీ. వెడల్పు , 4000 మీ. పొడవుతో సుమారు 350 ఎకరాల భూమి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ లోపల భాగాన, మరో 150 మీ. వెడల్పు 4000 మీ. పొడవుతో మరో 350 ఎకరాలు బయటవైపు ఉన్న ఇసుక పర నుంచి సేకరించి నాలుగు కిలోమీటర్ల మేర సుశాలమైన రన్ వే ను నిర్మించవచ్చని, అదేవిధంగా 100 అడుగుల విస్తీర్ణంతో ఒక రోడ్డును సూర్యలంక నుంచి పాండురంగాపురం వరకు రోడ్డుకు మరియు సుమారు 100 అడుగుల విస్తీర్ణంతో ఒక కెనాల్ ను, మరో 100 ఎకరాల భూమిని గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాల నిమిత్తం మత్స్యకారుల ప్రయోజనార్థం కేటాయించి, 80 అడుగుల విస్తీర్ణంతో ఒక సర్వీస్ రోడ్డును ఆదర్శనగర్, రామ్ నగర్ గ్రామాలను అనుసంధానించాలని తాము ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు.

ఇవి కాక, పర్యాటకులను ఆకర్షించేలా ఒక బొటానికల్ గార్డెన్, జులాజికల్ పార్క్ బటర్ ఫ్లై పార్క్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్లు వివరించారు.

అదేవిధంగా మరుప్రోలు వారిపాలెం నుండి పాండురంగాపురం, ఓడరేవు, రామాపురం, మీదుగా పొట్టి సుబ్బయ్య పాలెం వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం (ఇంటర్నల్ కారిడార్ లూపు లైన్ ) రూ.34 కోట్ల రూపాయలతో గతంలో తాము ప్రతిపాదించామని, ఈ రోడ్డు నిర్మాణం బహుళ ప్రయోజనాలను అందిస్తుందనిo వివరించారు.

జిల్లా కలెక్టర్, మరియు బాపట్ల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కలసి సమన్వయంతో బాపట్ల ప్రాంత అభివృద్ధి ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవాలని బాపట్ల ప్రజల తరపున కోరారు.

అదేవిధంగా అభివృద్ధి విషయంలో తన అవసరం ఉంటే ఎప్పుడైన, ఎక్కడికైనా వస్తానని కోన రఘుపతి స్పష్టం చేశారు.

Latest Articles

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

సింగనమల కోటలో వైఎస్సార్‌సీపీ ‘ఫ్యాన్’ ప్రభంజనం! 🚩 బుక్కరాయసముద్రం, కొట్టాలపల్లి గ్రామాలు వైఎస్సార్‌సీపీ మయం! ➔ జగనన్న సంక్షేమ పాలనే ఆయుధంగా ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తుఫాన్ ప్రచారం!

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*‌ బుక్కరాయసముద్రం: సింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం...
error: Content is protected !!