ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

నిధులు తెచ్చే బాధ్యత నాది… డంపింగ్ యార్డు తరలింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి!. మోడీ సహకారంతో ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇస్తున్నాం.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.    మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జన సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమం లో చెన్నాపురం నందవనం ఎదురుగ ఖాళీ స్థలం లో జరిగిన భారీజనసభ లో ఎంపీ ఈటల రాజేందర్ కీలక ప్రకటన.

– జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వతజవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న నరకయాతనపై నేను గత 4 రోజులుగా చేపట్టిన పాదయాత్ర ఈరోజు సాయంత్రం జవహర్ నగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగిసింది.

ఈ సభకు విచ్చేసిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు మరియు అపార వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కుర్చీలను నెత్తినెత్తుకుని కూర్చుని, మా ప్రసంగాలను ఆలకించి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క బాధితుడికి, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ప్రశాంగించిన ఈటెల.

వర్షానికి భయపడేంత చిన్నవాళ్ళం కాదు మనం!. నాలుగు రోజులు చెమటోడ్చి, అలుపుసొలుపు లేకుండా 60 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ఇక్కడికి చేరుకున్న యోధులం మనం. అలాంటి తెగువ ఉన్న జనసందోహం ముందు… ఈ వర్షం ఒక లెక్కా?.

 

నిన్న మనకు సరికొత్త స్ఫూర్తినిచ్చిన మన ‘ఫ్లోర్ లీడర్’ మహేశ్వర్ రెడ్డి గారు వర్షం గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్పారు. “అన్న వర్షం గనుక వస్తే అది శుభసూచకం… ఆ డంప్ యార్డు పోయినట్టే, నీకు శుభం జరిగినట్టే!” అంటూ ఆయన ఇచ్చిన భరోసా సభలో మరింత జోష్ నింపింది.

ఈ నాలుగు రోజుల పాదయాత్రలో నేను చూసిన బాధితుల కన్నీళ్లు నన్ను తీవ్రంగా కలచివేశాయి. వారి గాథలు వింటుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఉన్న సమస్యలు వర్ణించడానికి మాటలు చాలవు.

మెదక్ జిల్లా నుంచి వలస వచ్చిన విహాన్ చారి అనే 18 నెలల చిన్నారిని వీధికుక్కలు పీక్కుతిన్న దుస్థితిని చూసి గుండె తరుక్కుపోయింది.

చెత్త లారీల చక్రాల కింద ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

బాధితులకు సరైన న్యాయం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం కాపాడుతామని కోర్టుకు రాసిచ్చిన రామ్కీ సంస్థ తీరు వల్ల ఇక్కడ అనేకమంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు. చర్మవ్యాధులతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం బడుల్లో కూడా చేర్చుకోవడం లేదు.

ఇక్కడ చెత్త వేయడానికి వీలులేదని ఎన్జీటీ (NGT) కూడా జరిమానా వేసింది. కానీ, అన్నీ తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమీ పట్టనట్టు తాత్సారం చేస్తున్నారు. అప్పట్లో ఈ అంశంపై కేసు వేసింది నువ్వే కదా!. నిన్ను ఓడిపోతే గెలిపించిన మల్కాజిగిరి ప్రజలను నిచ్చెన మెట్లలాగా వాడుకుని ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు వీళ్లను మోసం చేశావు. సీఎం గారు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.

ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నా.. మీకు చేతకాకపోతే దీనికి సంబంధించిన డీపీఆర్ (DPR) తయారు చేసి ఇవ్వండి, కేంద్రం నుంచి నేను స్వయంగా మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాను. స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు చేయకపోతే రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, ఆ పనేదో మేమే చేస్తాం!.

నా పాదయాత్ర సందర్భంగా నేను స్పష్టం చేసిన కొన్ని ముఖ్య విషయాలు:

“నేను డంప్ యార్డు తీసేయాలని పాదయాత్ర చేస్తుంటే, ‘ఈటల రాజేందర్ పనిలేక తిరుగుతున్నాడు’ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ డంప్ యార్డ్ కాదు మీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుత. “జవహర్ నగర్ డంప్ యార్డ్ రీసైక్లింగ్ కోసం ఎంత ఖర్చవుతుందో డీపీఆర్ (DPR) చేసి ఇవ్వండి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ఆ డబ్బులు తీసుకొని వస్తాను. అలా తీసుకు రాలేకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను.

 

ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడుకునే వరకు, వారికి శాశ్వత పరిష్కారం లభించే వరకు నా పోరాటం ఆగదు.

మీ అందరి అండతో మన హక్కుల కోసం చివరి వరకు కొట్లాడుతాను. వీళ్లేనా మా నాయకులు వీరికేనా మాకు ఓటు వేసేది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు ప్రజలు ఇస్తారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే అసహ్యించుకుంటారు.

– అఖిలపక్షంగా వెళితే నా అధ్యక్షతనే మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి మూన్నాళ్ళ ముచ్చట చేశారు.

– మూన్నేళ్లలో చెత్త రాకుండా చేస్తా అన్నారు.

– ఎదురు చూసి మీరుp చేయడంలేదని నేను రోడ్డెక్కాను.

– కన్నతల్లిలాంటి చెరువులు కాలకూట విషంగా మారిపోయాయి.

– రాంకీ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి మభ్యపెట్టవద్దు.

– ఈ డంప్ ఎత్తివేసే వరకు మా పోరాటం ఆగదు.

– ఈ బాధితులు ఒంటరి కాదు మేము మీకు అండగా ఉంటాం.

– గత వారం రోజులుగా రాంకీ వాసన వచ్చే పనులు ఆపిందట. సువాసన వచ్చే స్ప్రేలు కొడుతున్నారు అని నాకు వాట్స్ అప్ లో పంపించారు.

– మేము వస్తె స్ప్రే లు కొట్టుడు కాదు.. నీకు ఇచ్చిన పని సక్కంగా చెయ్యి.

– ఇది పార్టీలకు, జెండాలకు సంబంధం లేని అంశం.

– ఈటల రాజేందర్ పని లేక తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్న మిమ్ముల్ని చూసి జాలిపడుతున్న.

– మోడీ సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇస్తున్నా.                                    మీ.. ఈటల రాజేందర్.

ఈ సభలో బీజేఎల్పీ నేత అల్లేటి మహేశ్వర్ రెడ్డి , ఎంపీలు రఘునందన్ రావు మాధవనేని , ఎమ్మెల్యేలు రామారావు పాటిల్ పవర్ , పైడి రాకేష్ రెడ్డి, దంపాల్ సూర్యనారాయణ , ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, డా. ఎస్. మల్లారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, డి. గిరివర్ధన్ రెడ్డి, వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, భరత్ గౌడ్, ఇంచార్జీ అధ్యక్షులు పి.విక్రమ్ రెడ్డి, సామ రంగారెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి బానుక నర్మద మల్లికార్జున్, రాష్ట్ర అధికార ప్రతినిధి గాండే సుధాకర్, సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, తల్లొజు ఆచార్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లాల తిరుమల్ రెడ్డి, చింతల మాణిక్ రెడ్డి, యం.ఎస్. వాసు, జన్నాపురెడ్డి సురేందర్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, సినీ నటి శ్రీమతి కవిత గార్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, డివిజన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, డంపింగ్ యార్డ్ జెఎసి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు, బాధితులకు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్...

Related Articles

గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన నిలుపుదల చేయాలని, మౌలిక సమస్యలను పరిష్కరింపజేయాలని, ఎస్ సి ఆర్ రైల్వే అధికారికి వినతి పత్రం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం : మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్...
error: Content is protected !!