మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారి
పొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సర్పంచ్ మడకం కుమారి మాట్లాడుతూ.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశంలో ‘ఉక్కు మనిషి’గా ప్రసిద్ధి చెందారని, భారతదేశ సమైక్యత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు మడకం ఆంధ్రయ్య, తొమ్మిదో వార్డు సభ్యుడు కుంజా రాంబాబు, పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

