బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ నాయకులు…
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 19 జూలై 2026.
రుద్రూర్ గ్రామానికి చెందిన 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో గ్రామానికి చెందిన 8 మందికి ఆరోగ్యరీత్యా వివిధ హాస్పిటల్ లో వైద్యం చేసుకుని, వైద్యం కు సంబంధించిన హాస్పిటల్ బిల్లులను శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు పత్తి రాము తీసుకెళ్లగా ఎమ్మెల్యే తన పిఏ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ప్రాసెస్ చేసి మంజూరైన చెక్కులను మండల నాయకుల ద్వారా రుద్రూర్ గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు 2,39,500 రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. ఇలా గత 12, 13 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా రుద్రూర్ గ్రామానికి మరియు మండలంలోని ఆయా గ్రామాలకు 100 ల సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కాకుండా ఎల్ఓసి చెక్కులను కూడా ఎమ్మెల్యే ద్వారా మంజూరు చేయించి పంపిణీ చేయడం జరిగింది. ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలకు అతీతంగా, కులమత బేధాలు చూడకుండా ఆపద ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే మనసున్న మంచి మనిషి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని ఆయనకు రుద్రూర్ మండల ప్రజలే కాకుండా, నాయకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్, డిసిసి కార్యదర్శి పత్తి రాము, వర్ని మార్కెట్ డైరెక్టర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, బుర్కా మారుతి తదితరులు పాల్గొన్నారు.
