స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు
అనపర్తి: నారాయణ ఇ-టెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణతో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఘనంగా నిర్వహించారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన, ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
{“remix_data”:[],”source_tags”:[],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం అలీషా, ఇ-కిడ్జ్ ఆర్‌అండ్‌డీ హెడ్ సునీత, కో-ఆర్డినేటర్ హరిత పాల్గొన్నారు. చిన్నారులు వివిధ జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేషధారణలు రూపొందించడంతో పాటు, దేశం కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుల గురించి ఈ తరం పిల్లలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేషధారణలో పాల్గొన్న చిన్నారులు తాము ధరించిన పాత్రల ప్రత్యేకతలను చిట్టిచిట్టి మాటలతో చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రతిభను చూసి కార్యక్రమానికి హాజరైన వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో నారాయణ ఇ-కిడ్జ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రిన్సిపాల్ లిఖిత, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.