పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు – రోబోటిక్ శస్త్రచికిత్స, ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీతో క్యాన్సర్‌కు చెక్
– రొమ్ము క్యాన్సర్లో ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ
– యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సర్జికల్ ఆంకాలజీ
ఆంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చిన బాబు
*ఖమ్మం, జూలై 17 ః*
క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిందని ,
క్యాన్సర్‌ను నయం చేయడమే కాదు రోగి జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చడం కూడా ఆధ
ునిక శస్త్రచికిత్సల లక్ష్యమని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సర్జికల్ ఆంకాలజీ ,
ఆంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చిన బాబు పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం
జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యూమర్ బయాలజీపై మెరుగైన
అవగాహన పెరగడంతో నేటి క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా రోగికి మంచి జీవన నాణ్యతను అందిస్తూ పూర్తిగా నయం చేస్తుందన్నారు. అత్యంత ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణలలో రోబోటిక్ శస్త్రచికిత్స, ఫ్లోరోసెన్స్
గైడెడ్ సర్జరీ ఒకటి అని, ఈ ఆధునిక టెక్నాలజీలు అత్యంత ఖచ్చితత్వం, తక్కువ టిష్యూ
డ్యామేజ్, తక్కువ రక్తనష్టం, వేగవంతమైన కోలుకునే అవకాశాలను అందిస్తున్నాయని అన్నారు. హై-డెఫినిషన్ 3డి విజన్, ట్రెమర్ – ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్, మనిషి చేతి కదలికలను
అనుకరించే రైస్తెద్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత నైపుణ్యంతో
నిర్వహించవచ్చునని తెలిపారు. సాధారణంగా చెప్పాలంటే పెద్ద కోతలు లేకుండా కేవలం 8 ఎంఎం చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స నిపుణుడు తన చేతులు శరీరం లోపల పనిచేస్తున్నట్లుగా ఆపరేషన్ చేయగలుగుతారని, దీని వలన రోగికి తక్కువ నొప్పి, చిన్న మచ్చలు , తక్కువ రక్తనష్టం కలుగుతుందని, ఇంకా స్మార్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కలయికతో
శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితంగా, సురక్షితంగా మారుతున్నాయని అన్నారు. మహిళల క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ ముఖ్యంగా గర్భాశయ, అండాశయ క్యాన్సర్లలో రోబోటిక్ శస్త్రచికిత్స గొప్ప ఫలితాలను ఇస్తోందని, రడీకల్ హైస్టేరెక్టమీ, లింఫ్ నోడ్ డిస్సేక్షన్ వంటి క్లిష్టమైన ఆపరేషన్లు సురక్షితంగా చేయవచ్చునని తెలిపారు. గతంలో 4-5 రోజుల ఆసుపత్రి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు చాలామంది రోగులను 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేయవచ్చునని తెలిపారు.
*రొమ్ము క్యాన్సర్లో ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ*
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కూడా ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీ కొత్త దిశను చూపుతోందని, ప్రత్యేకమైన డై ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, క్యాన్సర్ నుండి మొదట ప్రభావితమయ్యే సెంటినెల్ లింఫ్ నోడ్స్ ప్రత్యేక కెమెరా ద్వారా స్పష్టంగా కనిపిస్తాయని, దీని వలన అవసరమైన లింఫ్ నోడ్స్‌ను మాత్రమే ఖచ్చితంగా తొలగించవచ్చునని, గతంలో లాగే అన్ని లింఫ్ నోడ్స్ తొలగించాల్సిన అవసరం తగ్గి, చేతి వాపు(లైఎంపీహెడేమా), నొప్పి, ఇతర సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. ఇది రోగి జీవన నాణ్యతను మరింత మెరుగుపరుస్తుందన్నారు.
*యూరాలజీ క్యాన్సర్లలో సరికొత్త మార్పులు*
ప్రోస్టేట్, బ్లాడర్, కిడ్నీ, అడ్రినల్ ట్యూమర్ల చికిత్సలో రోబోటిక్ టెక్నాలజీ పెద్ద
మార్పు తీసుకొచ్చిందని, ప్రోస్టేట్, బ్లాడర్ క్యాన్సర్లలో పెళవిక్ ప్రాంతం చాలా ఇరుక
ుగా ఉండటం వల్ల ఓపెన్ సర్జరీ క్లిష్టంగా ఉండేదని, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా మెరుగైన
నేర్వె ప్రెజర్వేషన్ సాధ్యమై, ఉరినరీ కంటినయన్స్, సెక్సువల్ ఫంక్షన్ మెరుగ్గా కాపాడవచ్చునని తెలిపారు. కిడ్నీ క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ వలన పార్టీయల్ నీఫరెక్టమీ ఎక్కువగా చేయగలుగుతున్నామని, అంటే కేవలం ట్యూమర్ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించి , మిగిలిన ఆరోగ్యకరమైన కిడ్నీని కాపాడటం సాధ్యమవుతోందని, దీని వలన పూర్తి కిడ్నీ తొలగించాల్సిన అవసరం తగ్గి, క్యాన్సర్ నియంత్రణలో ఎలాంటి రాజీ లేకుండా మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. అడ్రినల్ ట్యూమర్లలో కూడా తక్కువ రక్తనష్టం, చిన్న గాయాలు, వేగవంతమైన కోలుకోవడం వంటి ప్రయోజనాలతో సురక్షితంగా శస్త్రచికిత్సలు చేయవచ్చునని తెలిపారు.
*కోలోరెక్టల్ క్యాన్సర్లలో ఖచ్చితత్వం*
క్యాన్సర్లలో ఈ టెక్నాలజీ పెద్ద మార్పు తీసుకొచ్చింది . ట్యూమర్ను ఖచ్చితంగా గుర్తించి తొలగించడం వల్ల చాలాసార్లు పెర్మనెంట్ కలస్టమీ అవసరం లేకుండా చేయగలుగుతున్నామని డాక్టర్ చిన్నబాబు తెలిపారు. స్మార్ట్ స్థాప్లర్ ఫైర్ టెక్నాలజీ ద్వారా బావల్ ఇండ్స్ ను మరింత సురక్షితంగా కలపవచ్చునని, లీకేజీ ప్రమాదం తగ్గి, మెరుగైన నేర్వె ప్రెజర్వేషన్ వలన ఉరినరీ, సెక్సువల్ క్వాలిటీ అఫ్ లైఫ్ కూడా బాగుంటుందని అన్నారు.
*ఛాతి క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో కొత్త యుగం*
ఛాతి శస్త్రచికిత్సలలో కూడా ఇప్పుడు పెద్ద కోతలు వేసే రోజులు పోయాయి. గతంలో
లాంగ్ సర్జరీస్ కోసం చెస్ట్ ఓపెన్ చేసి 7-10 రోజుల హాస్పిటల్ స్టే ఉండేది. ఇప్పుడు 8
ఎంఎం చిన్న పోర్ట్స్ ద్వారానే సురక్షితంగా లాంగ్ సర్జరీస్ చేయవచ్చు. ఫఫ్లయ్ టెక్నాలజీ -క్యాన్సర్ను వెలుగులో చూపించే సాంకేతికత ఫఫ్లయ్ ఫ్లూరెససెన్స్ ఇమగెంగ్ అనేది మరో అద్భుతమైన టెక్నాలజీ అన్ని డాక్టర్ చినబాబు తెలిపారు. ప్రత్యేక డై ఇంజెక్షన్ తర్వాత క్యాన్సర్ టిష్యూలు లేదా లింఫాటిక్ మార్గాలు గ్లో అవ్వడం ద్వారా వాటిని మరింత స్పష్టంగా గుర్తించవచ్చు. సెంటినల్ లింఫ్ నోడ్ మాపింగ్ కూడా మరింత ఖచ్చితంగా చేయగలుగుతున్నామన్నారు.
*రోగులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు*
తక్కువ నొప్పి, తక్కువ రక్తనష్టం , తక్కువ ఆసుపత్రి రోజులు, త్వరగా పనికి తిరిగి వెళ్లే అవకాశం, మెరుగైన జీవన నాణ్యత, తక్కువ మచ్చలు, కుటుంబ, భావోద్వేగ ఆర్థిక ఒత్తిడి తగ్గడం తదితర ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ విధంగా రోబోటిక్, ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలు క్యాన్సర్ శస్త్రచికిత్సలను కేవలం వ్యాధి నివారణకే పరిమితం చేయకుండా, రోగి జీవన నాణ్యతను కాపాడే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీకాంత్ దూడ, ఖమ్మం మార్కెటింగ్ మేనేజర్ బాలరాజు పాల్గొన్నారు.

