ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి..!* *అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి* *హెచ్.ఎస్.డబ్లు.ఎస్.ఎస్.బి.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజని కోరిన...

*మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి..!* *అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి* *హెచ్.ఎస్.డబ్లు.ఎస్.ఎస్.బి.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజని కోరిన పరమేశ్వర్ రెడ్డి*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం లోని కాలనీలలో నిత్యం ఎదుర్కొంటున్న మంచినీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్.ఎస్.డబ్లు.ఎస్.ఎస్.బి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులతో వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మంచినీరు, డ్రైనేజీ, వర్షపు నీరు తరలింపుకు పైపు లైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పనులను సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై  హెచ్.ఎస్.డబ్లు.ఎస్.ఎస్.బి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ గారు సానుకూలంగా స్పందించారు.

*ఈడీ పంకజ గారి దృష్టికి తీసుకెళ్లిన సమస్యల వివరాలు..*

1.ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీలోని ట్రంక్ సీవర్ లైన్‌కు అనుసంధానించేందుకు సీవరేజ్ లైన్ వేయడానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చడం. 2. ఉప్పల్ సాయిబాబా కాలనీలోని సీవరేజ్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదన. 3. హనుమాన్ నగర్ లో సీవరేజ్ లైన్ సమస్య, నీటి కాలుష్య సమస్య పరిష్కారం, మ్యాన్‌హోల్స్‌కు ప్లాస్టరింగ్ చేయడం. 4. రామంతాపూర్ శ్రీనివాసపురంలో నీటి సరఫరా వాల్వ్ మార్పు, స్ట్రీట్ నంబర్ 3, 4 లో సీవరేజ్ లైన్ల మార్పు, కాలనీలో వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఏర్పాటు. 5. రామంతాపూర్ లో గోఖలే నగర్ లో కాలుష్య సమస్యను నివారించేందుకు కొత్త నీటి సరఫరా పైప్‌లైన్ వేయడం. 6. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీలో సీవరేజ్ లైన్ల మార్పునకు సంబంధించిన సవరించిన అంచనాలు. 7. మల్లాపూర్, నోమా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓల్డ్ మల్లాపూర్ లో సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్య పరిష్కారం. 8. రామంతాపూర్ బాలకృష్ణ నగర్ కాలనీలో కొత్త సీవరేజ్ లైన్లకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు; రూ.40 లక్షల అంచనా వ్యయం. 9. రామంతాపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో స్ట్రీట్ నంబర్ 20లో సీవరేజ్ సమస్యను పరిశీలించి పరిష్కరించడం. 10. రామంతాపూర్ లోని ఏ.డి.ఆర్.ఎమ్ ఆసుపత్రి నుంచి కొత్తగా వేసిన రోడ్లపై సీవరేజ్ మ్యాన్‌హోల్స్‌ను పైకి ఎత్తడంకు సంబంధించిన ప్రతిపాదన E-Office లో పెండింగ్‌లో ఉంది. 11. ఉప్పల్ విజయపురి కాలనీ లో నీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు. 12. మల్లాపూర్ పిట్టల బస్తీలో నీటి సరఫరా జంక్షన్‌ను 300 మి.మీ. వ్యాసం నుంచి 100 మి.మీ. వ్యాసానికి మార్చడం. 13. ఉప్పల్ స్వరూప్ నగర్, వినాయక్ నగర్ కాలనీలలో సీవరేజ్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది ఆగి రెడ్డి, దుబ్బ లక్ష్మ రెడ్డి, జిలీల్ పాషా, వల్లపు శ్రీకాంత్ యాదవ్, ఆకారం అరుణ్ పటేల్, సాయి కిరణ్ గౌడ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల దేవి రెడ్డి, సింగారం శ్రీశైలం,బొడుగే మల్లేష్, బాలరాజు గౌడ్, సచిన్, చింటూ, మరియు సౌత్ స్వరూప్ నగర్ , స్వరూప్ నగర్, న్యూ భరత్ నగర్, వినాయక్ నగర్, సాయిబాబా కాలనీ హనుమాన్ నగర్, లక్ష్మీనారాయణ కాలనీ, శక్తి నగర్, రామంతపూర్, మల్లాపూర్ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!