పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాప్రా మండలం: కుషాయిగూడ : కుషాయిగూడ బస్ స్టాప్ పరిరక్షణ, ప్రయాణికులు మరియు స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు, చలాన్ల పేరుతో వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికులు గౌరవ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని కలిసి సమస్యలను వివరించి సమస్యను మీరు ప్రత్యక్షంగా చూసి పరిష్కారం చేయవలసిందిగా కోరగా….
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నేడు స్వయంగా కుషాయిగూడ బస్ స్టాప్ వద్దకు విచ్చేసి పరిస్థితిని పరిశీలించారు. బస్ స్టాప్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులు, బస్సులు నిలిచే ప్రాంతంలో ఏర్పడుతున్న సమస్యలు, రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల వల్ల ప్రజలు, ప్రయాణికులు, స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కి వివరించడం జరిగింది. ట్రాఫిక్ చలాన్ల పేరుతో స్థానిక వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులను కూడా ఎమ్మెల్యేకి వివరించారు. ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అసోసియేషన్ తరఫున ఎమ్మెల్యేని కోరారు.
సమస్యలను పూర్తిగా విన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ ప్రజలు మరియు స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే సంబంధిత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, బస్ స్టాప్ సక్రమంగా కొనసాగడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతామని బండారి లక్ష్మారెడ్డి తెలిపడం జరిగింది. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, స్థానికుల సమస్యలను స్వయంగా పరిశీలించి, వెంటనే స్పందించి పరిష్కారం కోసం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ముఖ్యులు, నాయకులు, పెద్దలు, వ్యాపారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.
