ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ములకపాడు ఆరోగ్య కేంద్రంలో అదనంగా ఇద్దరు డాక్టర్లను నియమించాలి,*

📰 Generate e-Paper Clip

*50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి*
*సిపిఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్* 18 జూలై 2026 . ఎన్విఆర్ న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. పొలిటికల్ పవర్ దుమ్ముగూడెం మండలం ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు అవసరం ఉండగా ప్రజెంట్ ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారని ఇంకా ఇద్దరు డాక్టర్ లు తక్షణమే నిర్మించాలని ఒకరు రెగ్యులర్ డాక్టరు మరొకరు మొబైల్ డాక్టర్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం మండలం ఏజెన్సీ మారుమూల ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్న పేషెంట్లకు ఒక డాక్టరు 24 గంటలు సర్వీసు చేయాలంటే సాధ్యం కాదు అని అన్నారు. సంబంధిత స్టాప్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఇంకా మొబైల్ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉపయోగించుకుంటున్నారని అలాకాకుండా రెగ్యులర్ స్టాఫ్ నర్స్ ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని రకాల వైద్య సదుపాయం కల్పించాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. దుమ్ముగూడెం అతిపెద్ద మండలంలోని ఈ ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల హాస్పటల్ గా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరైనా మరణిస్తే ఇక్కడే పోస్టుమార్టం చేయాలని ఈ హాస్పిటల్ లో కేటాయించిన సిబ్బందిని వేరే ప్రాంతాలకు పంపుతున్నారని మా సర్వేలో వచ్చింది భవిష్యత్తులో ఇక్కడే ఉంచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు అదేవిధంగా ఇక్కడ వస్తున్న పేషెంట్లు ఆ సౌకర్యాలు కల్పించకుండా పాడైపోయిన మరుగుదొడ్లు మరమ్మత్తులు చేయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య,కొర్సా చిలకమ్మ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, బొల్లి సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!