ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

రామవరంలో వైసీపీ శ్రేణులపై దాడి ఘటనపై వైసీపీ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలపై జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ధ్వజం
    అనపర్తి, జూలై 17: ఇటీవల అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ అనపర్తిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు.
    విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం అధికార బలంతో భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హయాంలో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలకు కేంద్రంగా మారిందని అన్నారు.
    రామవరంలో వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమని, ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరి నొక్కు శ్రీనుపై కూడా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. దళితులకు చెందిన నందిక సత్యనారాయణతో పాటు పలువురు తీవ్రంగా గాయపడినా పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ఈ అంశాన్ని అసెంబ్లీ, పార్లమెంట్ వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు.
    అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు నియోజకవర్గంలో రౌడీయిజం, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు తాము వస్తున్న విషయం తెలిసి ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని కాపాడేందుకు వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించారని ఆరోపించారు.
    నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపైనే రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు, దాడులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Latest Articles

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

  విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్...

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్

జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి...

Related Articles

చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ఉద్యమించాలిరజకుల హక్కులు, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలివల్లెపు సోమరాజు, అన్నారపు వెంకటేశ్వర్లుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

🙏🏻 దివంగత నేత డాక్టర్ వైయస్ ఆర్ గారి 17 వ వర్దంతి సందర్భంగా పాపటపల్లి గ్రామంలో ysr గారి విగ్రహం కి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా...

error: Content is protected !!